త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Indians Joke | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై జోక్.. పగలబడి నవ్విన ఫ్రాంచైజీ ఓనర్

ధీరూభాయ్ అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఒక స్టూడెంట్ ముంబై ఇండియన్స్‌పై చేసిన ఫన్నీ కామెంట్ వైరల్ అవుతోంది. ఇది విని నీతా అంబానీ ఎలా నవ్వారో చూడండి!

J

Viral news | Published On May 25, 2026, 3.20 pm IST

Mumbai Indians Joke | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై జోక్.. పగలబడి నవ్విన ఫ్రాంచైజీ ఓనర్
Advertisement

Mumbai Indians Joke | త్రినేత్ర.న్యూస్ : సాధారణంగా స్కూల్ ఫేర్‌వెల్ (Graduation) స్పీచ్‌లు ఎమోషనల్‌గా, భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసేలా ఉంటాయి. కానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో మాత్రం ఒక స్టూడెంట్ తన స్పీచ్‌తో అందరినీ నవ్వించాడు. ఏకంగా అంబానీ ఫ్యామిలీకి చెందిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టీమ్ వైఫల్యాలపై ఫన్నీగా సెటైర్ వేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు.

క్లాస్ ఆఫ్ 2026 గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో (Social media) విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వేడుకలో స్కూల్ హెడ్ బాయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రయాణం, స్కూల్‌లో వారు గడిపిన తీపి గుర్తులను నెమరువేసుకున్నాడు. ఆ తర్వాత భవిష్యత్ గురించి చెబుతూ, "మన ప్రియమైన ముంబై ఇండియన్స్ (MI) టీమ్‌కి వచ్చినట్లే, మన లైఫ్‌లో కూడా కొన్ని కష్టమైన సీజన్స్ (Tough seasons) వస్తాయి" అని అన్నాడు.

ఆ కుర్రాడు ఆ మాట అనగానే ఆడిటోరియం మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. వెంటనే కెమెరా.. స్కూల్ ఫౌండర్, చైర్‌పర్సన్ అయిన నీతా అంబానీ (Nita Ambani) వైపు తిరిగింది. ఊహించని ఈ కామెంట్‌కు ఆమె తన ముఖాన్ని చేతులతో కప్పుకుని పగలబడి నవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ తర్వాత ఆ స్టూడెంట్ తన స్పీచ్‌ను సీరియస్‌గా కంటిన్యూ చేశాడు. "కొన్ని సీజన్లలో ఏదీ మనకు అనుకూలంగా జరగదు. మనం పెట్టిన ఎఫర్ట్‌కి తగ్గ రిజల్ట్స్ రావు. అసలు ఏం జరుగుతుందో అని ప్రతిదాన్ని ప్రశ్నించుకుంటాం. కానీ, ఈ ఫ్రాంచైజీ (ముంబై ఇండియన్స్) మనకు నేర్పించిన అతిపెద్ద పాఠం ఏంటంటే.. మనం ఎవరమనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. మన లెగసీని, మన కష్టకాలంలో అండగా నిలబడిన వారిని ఎన్నటికీ వదులుకోకూడదు" అని అద్భుతంగా వివరించాడు.

చివరగా ముంబై ఇండియన్స్ పాపులర్ స్లోగన్ "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.. దునియా హిలా దేంగే హమ్ (Duniya Hila Denge Hum)" అంటూ తన స్పీచ్‌ను ముగించాడు. ఈ మాటలకు నీతా అంబానీ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఆ స్టూడెంట్ కోసం చప్పట్లు కొట్టారు.

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) తదితరులు కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఈ స్టూడెంట్ స్పీచ్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతని సమయస్ఫూర్తిని, పాజిటివ్ థింకింగ్‌ను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akhilesh Yadav (@lastminuteofindia)

Advertisement
Advertisement