త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wakefit Sleep Internship Season 5 | రోజూ నిద్రపోతే రూ.10 లక్షలు జీతం.. వేక్‌ఫిట్ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్ 5’ వచ్చేసింది!

పూణేకు చెందిన పూజా అనే యువతి రెండు నెలలు కేవలం నిద్రపోయి ఏకంగా రూ.9.1 లక్షలు సంపాదించింది. వేక్‌ఫిట్ (Wakefit) తీసుకొచ్చిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్ 5' ద్వారా మీరు కూడా నిద్రపోయి రూ.10 లక్షలు గెలుచుకునే అద్భుత అవకాశం ఉంది. దరఖాస్తు ఎలా చేయాలి? అర్హతలు ఏంటో తెలుసుకుందాం రండి.

J

Viral news | Published On Apr 16, 2026, 4.27 pm IST

Wakefit Sleep Internship Season 5 | రోజూ నిద్రపోతే రూ.10 లక్షలు జీతం.. వేక్‌ఫిట్ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్ 5’ వచ్చేసింది!

సంక్షిప్త సారాంశం

పూణేకు చెందిన యూపీఎస్సీ అభ్యర్థిని పూజా మాధవ్.. వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్ 4లో "స్లీప్ ఛాంపియన్"గా నిలిచి రూ.9.1 లక్షలు గెలుచుకుంది. వేక్‌ఫిట్ ఇప్పుడు 'స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్ 5'ను ప్రకటించింది. ఇందులో ఫైనల్‌కు ఎంపికైన వారికి కనీసం రూ.1 లక్ష గ్యారెంటీగా ఇస్తారు. విజేతగా నిలిచిన స్లీప్ ఛాంపియన్‌కు రూ.10 లక్షలతో పాటు ఫ్రీ వెకేషన్ ట్రిప్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన ఇంటర్న్‌లు రెండు నెలల పాటు రోజూ 9 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.

Advertisement

Wakefit Sleep Internship Season 5 | ఆఫీసుల్లో పని చేస్తూ అప్పుడప్పుడూ నిద్రమత్తులోకి జారుకునే వాళ్లను చూస్తుంటాం. కానీ, అదే నిద్రను ఒక ప్రొఫెషన్‌గా మార్చుకుని లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నిద్రపోవడమే ఉద్యోగం.. దానికి లక్షల్లో జీతం. ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ బ్రాండ్ 'వేక్‌ఫిట్ (Wakefit)' భారతీయుల నిద్ర లేమి సమస్యపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

నిద్రపోయి రూ.9 లక్షలు గెలుచుకున్న పూజా..

పూణేకు చెందిన 30 ఏళ్ల యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న పూజా మాధవ్ వావ్హల్.. కేవలం నిద్రపోయి ఏకంగా రూ.9.1 లక్షలు సంపాదించింది. వేక్‌ఫిట్ నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్-4'లో ఆమె ఈ ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 15 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు.

వీరికి వేక్‌ఫిట్ మ్యాట్రెస్‌లు (పరుపులు), స్లీప్ ట్రాకర్లు ఇచ్చి 60 రోజుల పాటు వారి నిద్రను పర్యవేక్షించారు. ఇందులో బ్లైండ్‌ఫోల్డ్ బెడ్ మేకింగ్, అలారం క్లాక్ హంట్ లాంటి ఫన్ టాస్క్‌లు కూడా ఇచ్చారు. చివరికి 91.36 స్లీప్ స్కోర్‌తో పూజా మాధవ్ "స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. మిగిలిన 14 మంది ఫైనలిస్టులకు గ్యారెంటీ ప్రైజ్ కింద తలా లక్ష రూపాయలు అందించారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.

Earn 10 Lakhs Just for Sleeping Apply for Wakefit Sleep Internship Season 5 Now

మీరూ రూ.10 లక్షలు గెలుచుకోవచ్చు! (Season 5 Details)

నిద్రపోవడాన్ని ఎంతగానో ఇష్టపడే వారికోసం వేక్‌ఫిట్ ఇప్పుడు 'స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్ 5' ప్రకటించింది. ఇందులో ఇంటర్న్‌లుగా ఎంపికైన వారికి కచ్చితంగా రూ.1 లక్ష ఇస్తారు. ఇక ఫైనల్‌లో 'స్లీప్ ఛాంపియన్'గా నిలిస్తే ఏకంగా రూ.10 లక్షలు, ఒక అద్భుతమైన వెకేషన్ ట్రిప్ మీ సొంతం అవుతాయి.

డ్రీమ్ జాబ్ ప్రొఫైల్ (Job Description)

ఉద్యోగం ప్రదేశం: మీ ఇంట్లోని మీ బెడ్ (వర్క్ ఫ్రమ్ హోమ్).

ఉద్యోగ వ్యవధి: 2 నెలలు.

బాధ్యతలు: పర్ఫెక్ట్‌గా నిద్రపోవాలి. ప్రతిరోజూ కచ్చితంగా 9 గంటలు నిద్రపోవాలి. జూమ్ కాల్స్, ఇంటి పనుల మధ్యలో పవర్ న్యాప్స్ (కునుకు) తీయడంలో ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. బ్రాండ్ న్యూ వేక్‌ఫిట్ మ్యాట్రెస్‌ మీద పడుకుని ఆ అనుభూతిని టెస్ట్ చేయాలి.

ఎవరెవరు అర్హులు? (Qualifications)

దిండును కొట్లాటలకు కాకుండా, కేవలం గాఢంగా నిద్రపోవడానికే వాడే టాలెంట్ ఉండాలి.

కునుకు తీయడానికి ఎప్పటికప్పుడు కొత్తకొత్త సాకులు వెతికే 'మాస్టర్ డిగ్రీ' ఉంటే మరీ మంచిది.

టీమ్ మీటింగ్స్, ట్రాఫిక్, సినిమాలు చూస్తున్నప్పుడు కూడా నిద్రపోయే నైపుణ్యం ఉండాలి.

వీకెండ్ ప్లాన్స్, పార్టీలు వదులుకుని మరీ నిద్రపోయిన ఘనమైన ట్రాక్ రికార్డ్ మీ సొంతమై ఉండాలి.

కంటి నిండా నిద్రపోతూ, లక్షలు సంపాదించే ఈ డ్రీమ్ జాబ్ ఆఫర్‌ను వదులుకోకండి. మీరు కూడా సీజన్ 5కు అప్లై చేసి రూ.10 లక్షలు గెలుచుకునే దిశగా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!

వెంటనే https://www.wakefit.co/sleepintern/ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి వెంటనే మీ వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి.

Advertisement

తాజావార్తలు

Advertisement