కస్టమర్లు ఇచ్చిన టిప్ డబ్బులతో 10 లక్షల కారు కొన్న యువకుడు
ముంబైకి చెందిన ప్రవిణ్ జోషిల్కర్.. ఓ ఇటాలియన్ క్రూజ్ షిప్‌లో పని చేస్తుంటాడు. ఆ షిప్‌లో ఎక్కువగా యూరప్, అమెరికన్ అతిథులు ఉంటారు. వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను చూసుకోవడమే అతడి డ్యూటీ.
Viral news | Published On Dec 10, 2025, 5.36 pm IST
హోటల్ అయినా ఇంకేదైనా ఎక్కడైనా కస్టమర్లకు సర్వీస్ ఇస్తే టిప్ ఆశిస్తారు. మీకు సర్వీస్ బాగా చేశాం. ఎంతో కొంత టిప్ ఇవ్వండి అని ఇన్‌డైరెక్ట్‌గా అడుగుతారు. టిప్పే కదా ఏముందిలే అనం పదో, పాతికో వాళ్ల చేతుల్లో పెడతాం. ఏదో చాయ్ పానీకి వాడుకుంటారులే పాపం అని ఇస్తాం. కానీ, అలా వచ్చిన టిప్ డబ్బులతోనే ఓ యువకుడు ఏకంగా 10 లక్షల విలువైన కారును కొన్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా.. పదండి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
ముంబైకి చెందిన ప్రవిణ్ జోషిల్కర్.. ఓ ఇటాలియన్ క్రూజ్ షిప్‌లో పని చేస్తుంటాడు. ఆ షిప్‌లో ఎక్కువగా యూరప్, అమెరికన్ అతిథులు ఉంటారు. వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను చూసుకోవడమే అతడి డ్యూటీ.
అలా మనోడి సర్వీస్ నచ్చిన కొందరు కస్టమర్లు బాగానే టిప్ ఇస్తారట. అలా కొంతకాలం పాటు వచ్చిన టిప్ మనీతో ఏకంగా కారు కొనేసి.. టిప్ డబ్బులతో కారు కొన్నాను. క్రూజ్ షిప్ లో బస చేసిన యూరప్, యూఎస్ గెస్టులకు ధన్యవాదములు..అంటూ కారు ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. మనోడి పోస్ట్ చూసిన నెటిజన్లకు పిచ్చెక్కిపోయింది. అరె..ఏంట్రా ఇది. టిప్ డబ్బులతో కారు కొనడం ఏంట్రా బాబు. మాకు నెల నెల వేలకు వేలు జీతాలు వస్తున్నా బైక్ కూడా కొనలేకపోతున్నాం..అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






