త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

టాటా స‌వతి త‌ల్లి ..ఇక లేరు

J

National | Published On Dec 5, 2025, 6.29 am IST

టాటా స‌వతి త‌ల్లి ..ఇక లేరు
Advertisement

టాటా సంస్థల అధినేత, దివంగత రతన్ టాటా సవితి తల్లి సిమోన్ టాటా కన్నుమూశారు. ఆమె టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా తల్లి. ఆమె వయసు 95 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

సిమోన్ టాటాది ఇండియా కాదు. తను పుట్టింది స్విట్జర్లాండ్‌లో. 1955 లో నావల్ టాటాను వివాహం చేసుకున్న సిమోన్ ఆ తర్వాత భారత్‌లో స్థిరపడ్డారు.

టాటా గ్రూప్ సంస్థలంటే భారత్‌లో ఎంత నమ్మకం ఉంటుందో అందరికీ తెలిసిందే. పారిశ్రామిక రంగంలో టాటా గ్రూప్ స్థానం ప్రత్యేకమైనది. ఆ సంస్థల ఫ్యామిలీకి వెళ్లిన సిమోన్ టాటా.. ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ లాక్మేను అగ్రస్థానంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

1996 లో ట్రెంట్ లిమిటెడ్, ఆ తర్వాత వెస్ట్‌సైడ్ బ్రాండ్స్‌ను నెలకొల్పి ఫ్యాషన్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు సిమోన్ టాటా.

రతన్ టాటాకు సిమోన్‌పై అమితమైన గౌరవం ఉండేది. సర్ రతన్ టాటా ఇన్‌స్టిట్యూట్‌తో పాటు ఇతర సేవా కార్యక్రమాల్లోనూ సిమోన్ టాటా చురుకుగా పాల్గొనేవారు.

సిమోన్ టాటా మృతి పట్ల టాటా సన్స్ సంతాపం వ్యక్తం చేసింది. లాక్మే, వెస్ట్‌సైడ్ లాంటి బ్రాండ్స్ వృద్ధిలో సిమోన్ పాత్ర చిరస్మరణీయమని, సిమోన్ ఆత్మకు శాంతి చేకూరాలని టాటా సన్స్ ప్రకటన విడుదల చేసింది.

సిమోన్ టాటా అంత్యక్రియలు డిసెంబర్ 6న శనివారం ఉదయం 9 గంటల తర్వాత ముంబైలోని కొలాబాలో ఉన్న కాథెడ్రల్ ఆఫ్ ది హోలీ నేమ్ చర్చిలో జరగనున్నాయి.

Advertisement
Advertisement