Man Kissing DJ Poster | నెట్టింట తీవ్ర దుమారం: డీజే ట్రాలీపై ఉన్న యువతుల పోస్టర్‌కు ముద్దులు.. సిగ్గుచేటు అంటున్న నెటిజన్లు
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో దారుణం చోటుచేసుకుంది. డీజే వాహనంపై ఉన్న మహిళల పోస్టర్‌కు ఓ వ్యక్తి పదే పదే ముద్దులు పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.
Viral news | Published On May 24, 2026, 9.30 pm IST
Man Kissing DJ Poster | త్రినేత్ర.న్యూస్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో (Muzaffarpur) ఓ పెళ్లి ఊరేగింపులో చోటుచేసుకున్న అసభ్యకర ఘటన ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. డీజే ట్రాలీపై (DJ trolley) అంటించి ఉన్న యువతుల పోస్టర్‌కు ఓ వ్యక్తి పదే పదే ముద్దులు పెడుతూ, అసహ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.
అసలేం జరిగిందంటే?
గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైతీ చౌక్ సమీపంలో ఓ వివాహ వేడుకలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వైరల్ క్లిప్‌లో.. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద శబ్దంతో డీజే (DJ) పాటలు ప్లే అవుతుండగా, ఆ వ్యక్తి డీజే వాహనం వైపు వంగి అందులో ఉన్న యువతుల పోస్టర్‌కు ముద్దులు పెట్టడం, నాలుకతో నాకడం (licking) స్పష్టంగా కనిపిస్తోంది.
చుట్టుపక్కల వారి ప్రవర్తనపై విమర్శలు
అయితే, ఈ వీడియో చూసిన వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తున్న విషయం మరొకటి ఉంది. ఆ వ్యక్తి చేస్తున్న అసభ్యకర పనిని ఆపాల్సింది పోయి, పక్కనే ఉన్న మరో యువకుడు అతన్ని చూసి నవ్వుతూ, తన సైగల ద్వారా మరింత ఎంకరేజ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
భగ్గుమంటున్న నెటిజన్లు
ఈ క్లిప్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి "సిగ్గుమాలిన చర్యలు" ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని (Misogyny) ఇలా నవ్వులాటగా తీసుకోవడం, ఎంజాయ్ చేయడం సమాజం ఎటు పోతోందో సూచిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. వేడుకల సమయంలో ఇలాంటి అనుచిత ప్రవర్తనను కేవలం 'సరదా'గా కొట్టిపారేయడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
"ఇందులో నవ్వడానికి ఏముంది? ఇలాంటి సంఘటనలే సమాజంలో మహిళల పట్ల అగౌరవాన్ని నార్మలైజ్ (Normalise) చేస్తాయి" అని ఒక యూజర్ రాసుకొచ్చారు.
"అతన్ని ఆపకుండా చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వుడమే ఇక్కడ అసలైన సమస్య" అని మరొకరు కామెంట్ చేశారు.
వేడుకల (Celebration culture) పేరుతో ఇలాంటి ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలేయడం, పబ్లిక్ బిహేవియర్, జవాబుదారీతనం (Accountability) తదితర అంశాలపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. కాగా, సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న ఈ వీడియోపై స్థానిక పోలీసులు, యంత్రాంగం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
View this post on Instagram
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



