Foreign Tourists Shunning India | భారత పర్యాటక రంగంలో వింత పరిస్థితి: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. వెనక్కి తగ్గుతున్న విదేశీయులు!
2025లో రికార్డు స్థాయిలో 3.3 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలు చేశారు. అయితే, అదే సమయంలో భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా హోటల్ ధరలు పెరగడం, మౌలిక సదుపాయాల లోపం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
Foreign Tourists Shunning India | త్రినేత్ర.న్యూస్ : భారత పర్యాటక రంగం ప్రస్తుతం ఒక వింతైన సవాలును ఎదుర్కొంటోంది. భారతీయులు గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తుంటే, విదేశీ పర్యాటకులు మాత్రం ఇండియా వైపు చూడటానికి జంకుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిన 'యాన్యువల్ టూరిజం స్నాప్‌షాట్ 2025' గణాంకాలు ఈ చేదు నిజాన్ని వెల్లడిస్తున్నాయి.
రికార్డు స్థాయిలో విదేశీ ప్రయాణాలు
2025 సంవత్సరంలో ఏకంగా 3.3 కోట్ల మంది భారతీయులు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇది 2024తో పోలిస్తే 5.9 శాతం, కోవిడ్ కంటే ముందు ఏడాది 2019తో పోలిస్తే 21.5 శాతం అధికం. భారతీయులు ఎక్కువగా సందర్శించిన దేశాల్లో యూఏఈ (26.3 శాతం), సౌదీ అరేబియా (10.3 శాతం), థాయ్‌లాండ్ (6.8 శాతం) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
తగ్గుతున్న విదేశీ పర్యాటకులు
భారతీయుల విదేశీ ప్రయాణాలు పెరుగుతుంటే, ఇండియాకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య మాత్రం ఆందోళనకరంగా పడిపోతోంది. 2019 లో భారత్‌కు వచ్చిన ఫారెన్ టూరిస్టుల సంఖ్య 1.1 కోట్లు కాగా, 2024 లో 99.5 లక్షలుగా ఉంది. 2025 లో 90.2 లక్షలుగా ఉంది. ఇది 2019 కంటే 17.5 శాతం తక్కువ.

ఇండియా కంటే విదేశాల్లోనే బస చౌక?
భారతీయులు సొంత దేశంలోని పర్యాటక ప్రాంతాల కంటే విదేశాలకే ఎందుకు మొగ్గు చూపుతున్నారనే అంశంపై విశ్లేషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. థాయ్‌లాండ్, వియత్నాం లేదా యూఏఈ వంటి దేశాల్లో లభించే హోటల్ గదుల ధరలు మన దేశంలోని గోవా లేదా కేరళ కంటే తక్కువగా ఉండటం ఒక ప్రధాన కారణం. విదేశాల్లో ఒక మోస్తరు హోటల్ గది రూ.5,000–8,000 మధ్య దొరుకుతుంటే, ఇండియాలో అవే సౌకర్యాలు ఉన్న గదికి అంతకంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తోందని పర్యాటకులు చెబుతున్నారు.

సవాళ్లు, మౌలిక సదుపాయాల లోపం
పర్యాటక రంగం కేవలం ప్రకటనలతో మాత్రమే వృద్ధి చెందదని, గ్రౌండ్ లెవల్‌లో అనుభవం కూడా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అపరిశుభ్రత: పర్యాటక ప్రాంతాల్లో చెత్తాచెదారం, సరైన నిర్వహణ లేకపోవడం విదేశీయులను నిరుత్సాహపరుస్తోంది.
ట్రాఫిక్, భద్రత: నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్, కాలుష్, అస్తవ్యస్తమైన డ్రైవింగ్ పర్యాటకులకు ఇబ్బందిగా మారుతున్నాయి.
బడ్జెట్ కోత: విదేశాల్లో భారత పర్యాటక ప్రచారానికి కేటాయించే బడ్జెట్‌ను ప్రభుత్వం దాదాపు 90 శాతం తగ్గించడం కూడా ఒక ప్రతికూల అంశంగా మారింది.

పరిష్కార మార్గాలు ఏమిటి?
భారతదేశం తన పర్యాటక వైభవాన్ని తిరిగి సాధించాలంటే గోల్డెన్ ట్రయాంగిల్, కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో 'టూరిజం సర్వీస్ జోన్లను' ఏర్పాటు చేయాలని పర్యాటక నిపుణులు సూచిస్తున్నారు. అక్కడ పారిశుధ్యం, లైటింగ్, రవాణా సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
https://x.com/gemsofbabus_/status/2029422021722124547
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




