Yadadri | భక్తులకు శుభవార్త.. ఇక ఆ రెండు జిల్లాల భక్తజనం చెంతకే యాదాద్రీశుడు
Yadadri | తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. శని, ఆదివారాల్లో అయితే యాదాద్రి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.
Yadadri | యాదాద్రి భువనగిరి : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. శని, ఆదివారాల్లో అయితే యాదాద్రి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రీశుడి దర్శనం కోసం భక్తజనం బారులు తీరుతున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. యాదాద్రి ఆలయానికి తక్కువ సంఖ్యలో తరలివస్తున్న ఆయా జిల్లాల భక్తుల చెంతకే యాదాద్రీశుడిని తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం నాగర్‌కర్నూల్, భూపాలపల్లి జిల్లాల నుంచి భక్తులు యాదాద్రికి తక్కువ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రెండు జిల్లాల భక్తులకు ప్రచార రథం ద్వారా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 20వ తేదీన భూపాలపల్లి, 27న నాగర్‌కర్నూల్ జిల్లాల్లో స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, ఇతర పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేయనున్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తమ చెంతకే వస్తున్నాడన్న విషయం తెలుసుకుని నాగర్‌కర్నూల్, భూపాలపల్లి జిల్లాల భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తమ కష్టాలు తీరుతాయని, తమకు ఎల్లప్పుడూ ఆ లక్ష్మీనరసింహ స్వామి రక్షణ నిలుస్తాడని భక్తులు స్మరించుకుంటున్నారు. మొత్తానికి ఈ రెండు జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Char Dham Yatra | చార్ ధామ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. ఇప్పటి వరకూ 12.62 లక్షల మంది పూజలు
మే 15, 2026

Yadadrigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తుల..
మే 10, 2026

South Africa | సౌతాఫ్రికాలో తొలిసారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
మే 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



