త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సిద్దిపేటపై ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డి: హ‌రీశ్‌రావు

Harish Rao | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి సిద్ధిపేట‌పై ఎందుకింత క‌క్ష అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. సిద్ధిపేట ప‌ట్ట‌ణ అభివృద్ధిపై అక్క‌సు పెట్టుకుని ఆ గ‌డ్డ‌పై ఎట్లా అడుగుపెడ‌తావ‌ని ప్ర‌శ్నించారు.

A

Telangana | Published On Mar 17, 2026, 12.34 pm IST

Harish Rao | సిద్దిపేటపై ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డి: హ‌రీశ్‌రావు
Advertisement

ప‌ట్ట‌ణ అభివృద్ధిపై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు
ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఈర్ష్యాద్వేషాలేనా
గత ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ. 1,070 కోట్ల నిధులను ఎందుకు రద్దు చేశావు
ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టు
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖ‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌ : ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి సిద్ధిపేట‌ (Siddipet)పై ఎందుకింత క‌క్ష అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. సిద్ధిపేట ప‌ట్ట‌ణ అభివృద్ధిపై అక్క‌సు పెట్టుకుని ఆ గ‌డ్డ‌పై ఎట్లా అడుగుపెడ‌తావ‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌, అధికారంలో ఉన్నా సిద్ధిపేట అభివృద్ధిపై ఈర్ష్యాద్వేషాలేనా ఎద్దేవా చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వివిధ అభివృద్ధి ప‌నుల కోసం విడుద‌లైన రూ.1,070 కోట్ల నిధుల‌ను ఎందుకు ర‌ద్దు చేశారని ప్ర‌శ్నించారు. ఆ నిధుల‌ను పున‌రుద్ధ‌రించి సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టాల‌ని సూచించారు. ఈ నెల 22న సిద్ధిపేట‌కు ముఖ్య‌మంత్రి రానున్న నేప‌థ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి హ‌రీశ్‌రావు లేఖ రాశారు. కక్షపూరితంగా రేవంత్ రద్దు చేసిన నిధుల గురించి.. ఆగిపోయిన పనుల గురించి మా సిద్దిపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతార‌ని మండిప‌డ్డారు. సిద్దిపేట అభివృద్ధిపై ఆనాడు రేవంత్ చేసిన విమర్శలను, ఆయ‌న‌ ఓర్వలేని తనాన్ని త‌మ ప్రజలు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధిపేట‌లో ఒక్క పనైనా చేశారా చెప్పాల‌ని స‌వాల్ చేశారు. రేవంత్ ప్రారంభించేందుకు వస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు కూడా త‌మ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైనవేన‌ని గుర్తు చేశారు.

లేఖ పూర్తి సారాంశం:

మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే మీకు రోజు గడిచేది కాదు. సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్ష్యా ద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మరచిపోవడం హాస్యాస్పదంగా ఉంది. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే గాకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారు. నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73 (ఒక వెయ్యి డెబ్బై కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు) కేటాయింపు జరిగింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను మీరు రద్దు చేశారు. దీంతో పనులన్నీ ఆగిపోయాయి. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గం. ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేది. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్దరించాలి. అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోండి.

సిద్దిపేటకు వస్తున్న మీకు మీరు రద్దు చేసిన నిధుల వ‌ల‌న‌ ఆగిన పనుల వివరాలు..

– ప్రభుత్వ వెటర్నరీ కళాశాల
– రంగనాయకసాగర్‌ టూరిజం
– కోమటిచెరువు శిల్పారామం
– సిద్దిపేట నియోజకవర్గ ఔటర్‌ రింగు రోడ్డు
– తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాల
– మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం
– సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్‌
– టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం
– త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం
– సిద్దిపేట – ఇల్లంతకుంట ఫోర్‌లేన్‌ రోడ్డు
– సిద్దిపేట – కిష్టాపూర్‌ రహదారి
– సిద్దిపేటలో మల్టీపర్పస్‌ ఆడిటోరియం
– సిద్దిపేట బ్లాక్‌ఆఫీస్‌ సమీపంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్‌

Advertisement
Advertisement