త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadwal Vijaya Lakshmi | ప్ర‌భుత్వంతో మాట్లాడి మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తం

Gadwal Vijaya Lakshmi | ఇప్ప‌టికే ఉద్యోగాలు కోల్పోయిన 317 మంది ఆర్టీసీ సిబ్బందికి తిరిగి విధుల్లో చేరేలా కృషి చేశామ‌ని.. మ‌రో 180 మందిని కూడా ఆదుకునేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijaya Lakshmi) భ‌రోసా క‌ల్పించారు.

S

Telangana | Published On Oct 23, 2026, 6.11 pm IST

Gadwal Vijaya Lakshmi | ప్ర‌భుత్వంతో మాట్లాడి మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తం
Advertisement
  • ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల‌కు సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి భ‌రోసా

Gadwal Vijaya Lakshmi | త్రినేత్ర న్యూస్‌: ఇప్ప‌టికే ఉద్యోగాలు కోల్పోయిన 317 మంది ఆర్టీసీ సిబ్బందికి తిరిగి విధుల్లో చేరేలా కృషి చేశామ‌ని.. మ‌రో 180 మందిని కూడా ఆదుకునేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijaya Lakshmi) భ‌రోసా క‌ల్పించారు. వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులకు తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో ఆర్టీసీ ఎండీ, సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్ర‌వారం దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్ మెంట్స్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.

వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సీఎం ప్రజావాణికి వచ్చి గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి సమస్యలు వివరించారు. ఈ సంద‌ర్భంగా వారికి విజ‌య‌ల‌క్ష్మి హామీ ఇచ్చారు. 263వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 103 దరఖాస్తులు అందాయని.. రెవెన్యూ శాఖకు 27, బీసీ సంక్షేమ శాఖకు 18, మున్సిపల్ శాఖకు 14, ఇతర శాఖలకు 44 దరఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement