త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lavu Rathaiah | ప్ర‌భుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు ర‌త్త‌య్య‌

Lavu Rathaiah | ఇంజనీరింగ్ విద్యార్థులు పనికిరారు అని కొందరు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అంటున్నారు.. అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదు అని విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ లావు ర‌త్త‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Aug 22, 2026, 10.39 pm IST

Lavu Rathaiah | ప్ర‌భుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు ర‌త్త‌య్య‌
Advertisement

Lavu Rathaiah | త్రినేత్ర‌.న్యూస్ : ఇంజనీరింగ్ విద్యార్థులు పనికిరారు అని కొందరు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అంటున్నారు.. అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదు అని విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ లావు ర‌త్త‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం యువ‌త కేటీఆర్‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నార‌ని, ఇది పెద్ద ఇండికేష‌న్ అని, అర్థ‌మ‌య్యే వాళ్ల‌కు అర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

యువత పవర్ ఏంటో ఇటీవలే జంతర్ మంతర్‌లో, తమిళనాడు ఎన్నికల్లో కూడా చూశాం. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన స్వాతంత్య్ర‌ ఉద్యమం లాంటిది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే పారిపోకుండా పోరాడిన నిరసనకారులను స్వాతంత్య్ర‌ ఉద్యమంలో చూశాం, మళ్లీ మొన్న జంతర్ మంతర్ వద్ద చూశాం. వచ్చే ఎన్నికల్లో రాజకీయ నాయకులు గతంలో లాగా నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. కచ్చితమైన ఆధారాలు, డేటా చూపిస్తేనే యువత ఓటు వేస్తారు. ఇదే తరహాలో డేటాతో మాట్లాడుతూ కేటీఆర్ యువతకు బాగా కనెక్ట్ అయి ఉన్నాడని, ఇది గ్రేట్ ఇండికేష‌న్ అని లావు ర‌త్త‌య్య వ్యాఖ్యానించారు.

ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పుడూ కూడా పనికిరాని వారు కాదు. రెండు మూడు కేసుల్లో కానీ, ఓ ఐదారు శాతం కానీ ఉండొచ్చు. వారిలో ఎక్కువ మంది సుమారు 80 శాతం ప్రొడక్టివ్‌.. అంతకంటే ఎక్కువ పోటీతత్వం ఉన్నవాళ్లు. వారు యూఎస్‌కు వెళ్తున్నారు. వారిలో ఒక్క విద్యార్థి కూడా డిగ్రీ లేకుండా ఇండియాకు తిరిగొస్తలేరు. ఈ విద్యార్థులు ఎక్కువ ఫోకస్ ఉన్నవాళ్లు, కష్టపడే తత్వం ఉన్నవాళ్లు. ప్రభుత్వంలో ఉన్నబాధ్యత గల వ్యక్తులు ఎలా వారిని పనికిరాని వారని అంటారో నాకు తెలియదని లావు రత్తయ్య ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement