Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్
Adluri Laxman Kumar | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Adluri Laxman Kumar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. సుష్మిత వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి అడ్లూరి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖను సోదరిలా భావిస్తున్నానని, ఆమె కుమార్తె ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు మార్పు కోసం అవకాశం ఇచ్చారన్న అంశాన్ని మరిచిపోవద్దన్నారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
పార్టీ అంతర్గత విభేదాలను మీడియా ముందు కాకుండా పార్టీ వేదికల్లోనే పరిష్కరించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డిని మెజార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారన్న అంశం మరిచిపోవద్దన్నారు. కాబట్టి పార్టీ నిర్ణయాలు, నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనను మంత్రిగా, సామాన్య కార్యకర్త అయిన వెడ్మా బొజ్జును పార్టీ ఎమ్మెల్యేగా చేసిందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
- ●Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి
- ●Hash Oil | హైదరాబాద్లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం
- ●Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి
- ●Rain Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
- ●Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా
- ●Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి

Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి

Hash Oil | హైదరాబాద్లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం

Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి

Rain Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ



