CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | లండన్‌లోని అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం.. నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడంతో.. సామాజిక న్యాయం కోసం మరింత అంకిత భావంతో పని చేయాలన్న ఆకాంక్ష మరింత పెరిగిందని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : లండన్‌లోని అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం.. నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడంతో.. సామాజిక న్యాయం కోసం మరింత అంకిత భావంతో పని చేయాలన్న ఆకాంక్ష మరింత పెరిగిందని సీఎం అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1921-22లో లండన్‌లోని ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లో నివసించిన ఇంటిని సీఎం సందర్శించారు.

“మహనీయులు డాక్టర్ అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది. ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుంది. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న నా ఆకాంక్ష మరింత పెరిగింది” అని సీఎం రేవంత్ రెడ్డి సందర్శకుల డైరీలో రాశారు.
అంబేడ్కర్ హౌస్‌ను ప్రస్తుతం డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలకు అంకితమైన మ్యూజియంగా ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధత, సమానత్వం, కులరహిత సమాజం, అణచివేత లేని సమాజం, సామాజిక న్యాయానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆయన సిద్ధాంతాలను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తుంది. దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేడ్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ (ACDA) చైర్ Ms. సంతోష్ దాస్ MBE, యూకేలో బాబాసాహెబ్ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.

పర్యటన పూర్తయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి. భారతీయుల్లో గొప్ప వ్యక్తుల్లో ఒకరైన డాక్టర్ అంబేద్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని చూసి, ఆయనతో ముడిపడిన వస్తువులను తాకగలగడం ఎంతో గొప్ప అనుభూతి” అని అన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్
- ●Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి
- ●Hash Oil | హైదరాబాద్‌లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం
- ●Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి
- ●Rain Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
- ●Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్

Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి

Hash Oil | హైదరాబాద్‌లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం

Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి



