త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Panthangi Toll Plaza | 5 రోజుల్లో 3 లక్షలు.. ఐదు రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజాను దాటిన‌ వాహనాలు

పండుగ‌లు వ‌చ్చాయంటే ప‌ట్నం ఖాళీ అవుతుంది. అస‌లే సంక్రాంతి (Sankranti Festival). ఆంధ్రుల‌కు పెద్ద పండుగ‌. దీనికి సెల‌వులు కావ‌డంతో న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు కూడా సొంతూర్ల‌కు (Sankranti Traffic) ప‌య‌ణ‌మ‌య్యారు.

G

Telangana | Published On Jan 15, 2026, 6.27 am IST

Panthangi Toll Plaza | 5 రోజుల్లో 3 లక్షలు.. ఐదు రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజాను దాటిన‌ వాహనాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పండుగ‌లు వ‌చ్చాయంటే ప‌ట్నం ఖాళీ అవుతుంది. అస‌లే సంక్రాంతి (Sankranti Festival). ఆంధ్రుల‌కు పెద్ద పండుగ‌. దీనికి సెల‌వులు కావ‌డంతో న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు కూడా సొంతూర్ల‌కు (Sankranti Traffic) ప‌య‌ణ‌మ‌య్యారు. గ‌త శ‌నివారం నుంచి సంక్రాంతి సెల‌వులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో జ‌న‌వ‌రి 10 నుంచి 14వ తేదీ వ‌ర‌కు అంటే ఐదు రోజుల‌పాటు 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో భారీగా వాహ‌నాల ర‌ద్దీ కొన‌సాగింది.

శుక్ర‌వారం 53 వేల వాహ‌నాలు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజాను (Panthangi Toll Plaza) దాట‌గా, ఇక శనివారం ఒక్క‌రోజే 71,284 వాహనాలు, ఆదివారం 62 వేలు, సోమవారం 56 వేలు, మంగళవారం 62 వేలు వెళ్లాయి. ఈ ఐదు రోజులు కలిపి పంతంగి టోల్‌ప్లాజా మీదుగా ఇరువైపులా 3.04 లక్షల వాహనాలు రాకపోకలు సాగించడం గ‌మ‌నార్హం. భోగి కావ‌డంతో బుధవారం వాహనాల రద్దీ సాధారణంగానే ఉంది. గ‌తేడాది పండుగ‌కి 3 రోజుల ముందు 2.07 లక్షల వాహనాలు పంతంగి టోల్‌గేట్ నుంచి రాకపోకలు సాగించాయి.

ఈసారి కూడా భారీ స్థాయిలో వాహనాలు వెళ్తాయని పోలీసులు అంచనా వేశారు. కానీ ఈ మార్గంలో బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాల్లో అండర్‌పాస్‌ వంతెనల నిర్మాణ పనుల మూలంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని రాకపోకలు సాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నాగర్జునసాగర్‌ హైవే మీదుగా.. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి మార్గంలో చిట్యాల మీదుగా రాకపోకలు సాగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement