త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGS RTC | స్పెష‌ల్ బ‌స్సుల‌తో.. ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.100 కోట్లు

TGS RTC | సంక్రాంతి పండుగ ఆర్టీసీకి (TGS RTC) పంట పండించింది. ఈ నెల 9 నుంచి 14 వ‌ర‌కు ఐదు రోజుల్లో రోడ్డు ర‌వాణా సంస్థ‌కు అక్ష‌రాలా రూ.100 కోట్ల ఆదాయం వ‌చ్చింది. పండుగ సంద‌ర్భంగా టీజీఎస్ ఆర్టీసీ 6 వేల ప్ర‌త్యేక బ‌స్సులు న‌డిపింది.

G

Telangana | Published On Jan 15, 2026, 7.44 am IST

TGS RTC | స్పెష‌ల్ బ‌స్సుల‌తో.. ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.100 కోట్లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి (TGS RTC) పంట పండించింది. ఈ నెల 9 నుంచి 14 వ‌ర‌కు ఐదు రోజుల్లో రోడ్డు ర‌వాణా సంస్థ‌కు అక్ష‌రాలా రూ.100 కోట్ల ఆదాయం వ‌చ్చింది. పండుగ సంద‌ర్భంగా టీజీఎస్ ఆర్టీసీ 6 వేల ప్ర‌త్యేక బ‌స్సులు న‌డిపింది.

హైద‌రాబాద్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు ఇత‌ర రాష్ట్రాలు, రాష్ట్ర వ్యాప్తంగా న‌డిపిన ఈ బ‌స్సుల్లో సుమారు 2.4 కోట్ల మంది ప్ర‌యాణించార‌ని అధికారులు వెల్ల‌డించారు. త‌ద్వారా రూ.100 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ హైద‌రాబాద్‌కు నామ‌మాత్రంగానే బ‌స్సులు న‌డింది. తెలంగాణ బ‌స్సులు మాత్రం ఏపీకి 6,431 న‌డిచాయి. గ‌తేడాది ఈ సంఖ్య 5,400గా ఉంది. ఈసారి వెయ్యి బ‌స్సులు అద‌నంగా న‌ప‌డంతో ఆదాయం కూడా పెరిగింద‌ని తెలిపారు.

మరోవైపు సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లినవారు ఆది, సోమవారాల్లో పెద్దసంఖ్యలో తిరిగి రానున్నారు. దీంతో ఈ నెల 18, 19 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నామ‌ని అధికారులు చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement