Crows | గోనెసంచిలో వేసుకుని.. కాకులనూ ఎత్తుకెళ్తున్నారు..
Crows | చనిపోయినవారికి కర్మకాండలు నిర్వహించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను పక్షులకు పెడతారు. వాటిని కాకులు (Crows) ముడితే.. చనిపోయిన వారే వచ్చి తీసుకున్నట్లు భావిస్తారు. పొద్దునే ఇంటి మీద వాలిన కాకి అదేపనిగా కావ్‌కావ్ అని అరుస్తూ ఉంటే, ఆ ఇంటికి చుట్టాలొస్తున్నారని అనేవారు.
Crows | త్రినేత్ర.న్యూస్: చనిపోయినవారికి కర్మకాండలు నిర్వహించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను పక్షులకు పెడతారు. వాటిని కాకులు (Crows) ముడితే.. చనిపోయిన వారే వచ్చి తీసుకున్నట్లు భావిస్తారు. పొద్దునే ఇంటి మీద వాలిన కాకి అదేపనిగా కావ్‌కావ్ అని అరుస్తూ ఉంటే, ఆ ఇంటికి చుట్టాలొస్తున్నారని అనేవారు. అలాంటి కాకులు ఇప్పుడు కానరాకుండా పోయాయి. మారిన జీవన విధానం, వాతావరణ మార్పులు, విచ్చలవిడిగా సెల్‌ఫోన్ టవర్లలో పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ కాకులు కనిపించడం లేదు. దీంతో కొందరు వ్యక్తులు వికారాబాద్ (Vikarabad) వంటి ప్రాంతాల్లో కాకులను పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇలా తరలిస్తున్న వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వికారాబాద్ జిల్లా యాలల మండలం ముద్దాయిపేటలో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. వారిని హైదరాబాద్‌లోని ముర్గీచౌక్, ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన రహమత్, అమీర్‌గా గుర్తించారు. బాగాయిపల్లి సమీపంలో పట్టుకున్న సుమారు యాభై కాకులను గోనెసంచిలో వేసుకుని స్కూటీపై ముద్దాయిపేటకు వచ్చారు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిని అడ్డగించారు.

దీంతో తమది హైదరాబాద్ అని, గత మూడు నెలలుగా పరిగి, కొడంగల్, మహబూబ్‌నగర్, కమాల్‌పూర్, బాగాయిపల్లి తదితర ప్రాంతాల్లో కాకులు పట్టుకుని తీసుకెళ్తున్నామని వెల్లడించారు. వారి మాటలకు ఆశ్చర్యపోయిన స్థానికులు అనుమానంతో యాలాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితులను స్టేషన్‌కు తరలించి విచారించగా.. వాటిని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారని, చిన్నపిల్లలకు దిష్టి తగిలితే కుటుంబ సభ్యులు కాకిని కొనుక్కెళ్లి వారిపైనుంచి తిప్పి వదిలేస్తారని తేలింది. యువకులు పట్టుకున్న కాకులను అటవీ శాఖ అధికారుల సమక్షంలో వదిలిపెట్టామన్నారు. అనంతరం ఇద్దరినీ స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి పంపించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




