Maheshkumar Goud | సెక్యులర్ ఓట్లను తొలగిస్తున్నారనే అనుమానముంది: మహేశ్‌కుమార్‌గౌడ్
Maheshkumar Goud | ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని ఆయన విమర్శించారు.
- ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉందాం
- బీజేపీ తదుపరి లక్ష్యం పంజాబ్, తెలంగాణే
- ఓట్ల తొలగింపే బెంగాల్‌లో బీజేపీ గెలుపుకు కారణం
- మంత్రులు ప్రతివారం నియోజకవర్గాల్లో పర్యటించాలి
- అక్రమాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి
- బీఎల్ఏ, ఎస్‌ఎస్‌ఏలతో సమీక్ష సమావేంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Maheshkumar Goud | త్రినేత్ర.న్యూస్: ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీజేపీ తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని ఆయన విమర్శించారు. ఇందిరా భవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLA), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (SSA)ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
30 లక్షల కొత్త ఓట్లను..
ఒక రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించి, కేవలం 30 లక్షల కొత్త ఓట్లను మాత్రమే జాబితాలో చేర్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఓటర్ల తొలగింపు ప్రక్రియ కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక నిఘా ఉంచుతుంది. ప్రతి వారం మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై దృష్టి సారిస్తారు అని ఆయన వెల్లడించారు.

ఓటర్ల సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాం..
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టడమే లక్ష్యం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది అని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమావేశాలకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.
తాజావార్తలు
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక





