త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh | మాట నిల‌బెట్టుకున్న విరోష్‌ జంట‌.. విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్ అంద‌జేత‌

Virosh | కేవలం సినిమాలే కాదు, సమాజ సేవలోనూ తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించారు స్టార్ కపుల్ విరోష్ జంట‌. గ‌త‌ ఫిబ్రవరిలో ప్రకటించిన "చిన్ననాటి కల"ను నిజం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

S

Telangana | Published On Jun 14, 2026, 1.25 pm IST

Virosh | మాట నిల‌బెట్టుకున్న విరోష్‌ జంట‌.. విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్ అంద‌జేత‌
Advertisement
  • ఊరికి చాలా చేయాల్సింది ఉంది అంటూ విజ‌య్‌ భావోద్వేగం

Virosh | త్రినేత్ర‌.న్యూస్‌: కేవలం సినిమాలే కాదు, సమాజ సేవలోనూ తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించారు స్టార్ కపుల్ విరోష్ జంట‌. ఇటీవ‌ల గృహ‌ప్ర‌వేశం సంద‌ర్భంగా ఇచ్చిన మాటను నెర‌వేర్చారు. చేత‌ల్లో చేసి చూపించి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. గ‌త‌ ఫిబ్రవరిలో ప్రకటించిన "చిన్ననాటి కల"ను నిజం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 188 మంది విద్యార్థులకి స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల‌కు రూ.10,016, మిగతా వారికి రూ.5,116 చొప్పున పంపిణీ చేశారు. అంత‌కుముందు విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న‌ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేటకి రష్మికతో కలిసి వెళ్లారు.

అచ్చంపేట మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లు ప్రకటించారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన 180 మంది విద్యార్థుల పూర్తి జాబితాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఈ ఉపకారవేతనాలు అందజేయనున్నారు. ఆయన స్వగ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) స్కాలర్‌షిప్ సాధించారు. ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డినందుకు విరోష్ జంట‌పై గ్రామస్థులు, అభిమానులు ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

 

నేనెప్పుడూ ర్యాంక‌ర్‌ను కాదు: విజ‌య్‌దేవ‌ర‌కొండ 

నేనెప్పుడూ 1st, 2nd ర్యాంకర్ కాదు.. రష్మిక అసలే కాదు. సొంతూరితో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊరికి చేయాల్సింది చాలా ఉంది. జీవితంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఫోక‌స్ చాలా ముఖ్యం. ఈ రెండింటిపై దృష్టి పెడితే ఎల్ల‌ప్పుడూ మంచి అవ‌కాశాలుంటాయి. మనం మాట్లాడే మాట, మన బాడీ లాంగ్వేజ్ చూసే పిల్లలు నేర్చుకుంటారు. ఈరోజు మీ అంద‌రితో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ, జిల్లా విద్యా అధికారి ర‌మేశ్ నాకు గుర్తింపు ఇచ్చారు. ఫ‌లితాల్లో వారి ఎఫ‌ర్ట్ చాలా ఉంది. నాగ‌ర్‌క‌ర్నూల్ ఈసారి తెలంగాణ‌లో సెకండ్ ప్లేస్‌లో రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. ఇది ఇలాగే కొన‌సాగించండి. ఈరోజు అచ్చంపేటలో మొదలుపెట్టాం. మెల్లగా తెలంగాణ అంతా వెళ్లాలనేది మా ఆలోచ‌న‌.

 

గొప్ప‌గా ఎద‌గండి.. ర‌శ్మిక ఇన్‌స్పైరింగ్ స్పీచ్‌

ఈరోజు నేను రష్మిక మందన్న దేవరకొండలా మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులు చాలా క‌ష్ట‌ప‌డి ర్యాంకులు సాధించారు. వారంద‌రికీ అభినంద‌న‌లు. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

ఇప్ప‌టివ‌ర‌కు అందించిన విరాళాల వివ‌రాలివి..

  • తన ఫిలింఫేర్ అవార్డు ప్రైజ్ మనీ నుండి రూ.25 లక్షలను సీఎం సహాయ నిధికి (CM Relief Fund) విరాళంగా ఇచ్చారు
  • కొవిడ్ సమయంలో 'మిడిల్ క్లాస్ ఫండ్' ద్వారా 17,723 మధ్యతరగతి కుటుంబాలను ఆదుకున్నారు
  • కొవిడ్-19 సహాయక చర్యల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
  • వరద సహాయక చర్యల కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల సాయమందించారు..
  • కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
  • ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున ఎండకాలంలో ప్రజలకు ఐస్‌క్రీమ్‌లు పంపిణీ చేస్తారు.
  • దేవర‌కొండ ఫౌండేష‌న్‌ ద్వారా 'ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్'ను ప్రారంభించి, వందలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు.
  • అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి 'దేవరశాంటా' (DeveraSanta) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • 'ఖుషి' సినిమా విజయం సాధించిన తర్వాత 100 కుటుంబాలకు రూ.1 కోటి (ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున) విరాళంగా ఇచ్చారు.

 

Advertisement
Advertisement