Ala Venkateshwar Reddy | రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
Ala Venkateshwar Reddy | రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందేనని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Ala Venkateshwar Reddy | త్రినేత్ర న్యూస్: రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందేనని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం మహ్మద్ హుస్సేన్ పల్లి వాగు నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్ఐ ప్రాజెక్టు (KLI Project) నుండి నీటిని వదిలాలని అన్నారు. ఆ నీటితో చెరువులను నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరారు.
దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక మాఫియా దోపిడీతో బీఆర్ఎస్ నిర్మించిన బ్రిడ్జి ప్రమాదంలో చిక్కుకుంది. కందూరు పెద్ద వాగువెంట రైతులకు మద్దతుగా పాదయాత్రలో ఇసుక మాఫియా చేసిన విధ్వంసం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ చూసిన అక్రమ ఇసుక తవ్వకాలే దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు అక్రమ సంపాదనకు అలవాటు పడి జీవనదిగా ఉండే పెద్దవాగును ఎడారిగా మార్చేశారు.
నిజాలపూర్ గ్రామంలో పెద్దవాగుపై నిర్మించిన వంతెన పిల్లర్ల చుట్టూ ఉన్న ఇసుకను కూడా వదల్లేదు. పది అడుగుల మేర ఇసుక తవ్వడంతో పుట్టింగ్ లు తేలి బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్రిడ్జ్ పునాది వద్ద రక్షణ చర్యలు చేపట్టి ఇసుక మాఫియాను అరికట్టాలి అని వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇసుక అక్రమార్కుల బరితెగింపు..ప్రమాద అంచున నిజాలాపూర్ బ్రిడ్జి...
దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక మాఫియా దోపిడీతో బీఆర్ఎస్ నిర్మించిన బ్రిడ్జి ప్రమాదంలో చిక్కుకుంది...
కందూరు పెద్ద వాగువెంట రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర లో ఇసుక మాఫియా చేసిన విధ్వంసం వెలుగులోకి వచ్చింది.ఎక్కడ చూసిన అక్రమ ఇసుక తవ్వకాలే దర్శనమిస్తున్నాయి.అధికారపార్టీ నాయకులు అక్రమ సంపాదనకు అలవాటు పడి జీవనదిగా ఉండే పెద్దవాగును ఎడారిగా మార్చేవేశారు.
నిజాలపూర్ గ్రామంలో పెద్దవాగుపై నిర్మించిన వంతెన పిల్లర్ల చుట్టూ ఉన్న ఇసుకను కూడా వదల్లేదు ఇసుకాసురులు..
పది అడుగులమేర ఇసుక తవ్వడంతో పుట్టింగ్ లు తేలి బిడ్జ్ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది.ఇది గమనించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.బిడ్జ్ పునాది వద్ద రక్షణ చర్యలు చేపట్టి ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
— Ala Venkateshwer Reddy (@AlaVenkateshwer) October 23, 2026
తాజావార్తలు
- ●Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు
- ●Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి
- ●Girl Dies | దసరా సెలవులకొచ్చి.. బాలిక అనుమానాస్పద మృతి
- ●Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు
- ●KTR | బలహీనంగా భారతీయ జనతా పార్టీ
- ●Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే

Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు

Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి

Girl Dies | దసరా సెలవులకొచ్చి.. బాలిక అనుమానాస్పద మృతి

Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు




