Girl Dies | దసరా సెలవులకొచ్చి.. బాలిక అనుమానాస్పద మృతి
Girl Dies | దసరా సెలవులకొచ్చిన 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
Girl Dies | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు బోడతండాలో బాలిక (Girl) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తండాలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద 17 ఏళ్ల బాలిక మృతదేహం లభించింది. బాలిక మృతదేహంపై కాలిన గాయాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంట్లో ఉండాల్సిన బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి బాలిక మృతదేహం లభించిన ట్రాన్స్‌ఫార్మర్ సమీపం నుంచి గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఘటనా స్థలం సమీపంలో రాత్రి నుంచి ఆ వ్యక్తి బైక్ నిలిపి ఉంచినట్లు గుర్తించారు. ఆ యువకుడే బాలికను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు నిజాలు బయటపడతాయని, అనుమానాస్పద మృతి కోణంలోనూ, విద్యుత్ ఘాతమా లేక ఇతర కారణాలా అనే కోణంలోనూ లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు
- ●Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి
- ●Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు
- ●KTR | బలహీనంగా భారతీయ జనతా పార్టీ
- ●Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే
- ●Deepika Padukone | తల్లయిన నెల రోజులకే కెమెరా ముందుకు దీపికా పడుకోణ్ - షారుఖ్ ఖాన్ కింగ్‌తో రీఎంట్రీ

Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు

Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి

Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు

KTR | బలహీనంగా భారతీయ జనతా పార్టీ





