త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGHRC | ఎడ‌మ క‌న్నుకు బ‌దులుగా కుడి కన్నుకు స‌ర్జ‌రీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ

TGHRC | సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ క‌న్నుకు బదులుగా కుడి కన్నుకు శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా స్వీకరించింది.

S

Telangana | Published On Oct 6, 2026, 4.38 pm IST

TGHRC | ఎడ‌మ క‌న్నుకు బ‌దులుగా కుడి కన్నుకు స‌ర్జ‌రీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ
Advertisement

TGHRC | త్రినేత్ర న్యూస్ : సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ క‌న్నుకు బదులుగా కుడి కన్నుకు శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా స్వీకరించింది.

ఈ ఆరోపణలు నిజమైతే, వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు సంబంధించి పొందిన సమ్మతి వంటి అంశాలపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి నుంచి సమగ్ర నివేదికను కమిషన్ కోరింది. రోగికి సంబంధించిన వైద్య రికార్డులు, సూచించిన, నిర్వహించిన శస్త్రచికిత్స వివరాలు, రోగి/కుటుంబ సభ్యుల నుంచి పొందిన సమ్మతి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, నిర్వహించిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 6న ఉద‌యం 11 గంట‌ల‌కు చేప‌ట్ట‌నుంది.

Advertisement
Advertisement