త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG EdCET 2026 | తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. మే 12న పరీక్ష, పూర్తి షెడ్యూల్ ఇదే!

TG EdCET 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12న ఆన్‌లైన్ పరీక్ష జరగనుండగా, మే 30న ఫలితాలు విడుదల చేయనున్నారు. రూ.1000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

J

Telangana | Published On Feb 23, 2026, 6.39 pm IST

TG EdCET 2026 | తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. మే 12న పరీక్ష, పూర్తి షెడ్యూల్ ఇదే!
Advertisement

TG EdCET 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EdCET 2026) షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఎడ్‌సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కే ప్రతాప్ రెడ్డి సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు ఇవే

బీఈడీ (B.Ed) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రక్రియ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23, 2026 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ (సాధారణ రుసుముతో) ఏప్రిల్ 15, 2026.

పరీక్ష నిర్వహణ తేదీ మే 12, 2026 (రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో). ఫలితాల విడుదల తేదీ మే 30, 2026. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారు కింద తెలిపిన విధంగా ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చు.

రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంటుంది.

ఈ ఏడాది కూడా పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్ (CBT) విధానంలోనే రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement