త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kyatanapalli | క్యాతనపల్లిలో ఉద్రిక్త‌త‌.. మంత్రి వాహ‌నంపై రాళ్లు రువ్విన మాజీ ఎమ్మెల్యే

Kyatanapalli | మంచిర్యాల జిల్లా క్యాత‌న‌ప‌ల్లి (Kyatanapalli)లో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంద‌ర్భంగా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

D

Telangana | Published On Feb 17, 2026, 12.02 pm IST

Kyatanapalli | క్యాతనపల్లిలో ఉద్రిక్త‌త‌.. మంత్రి వాహ‌నంపై రాళ్లు రువ్విన మాజీ ఎమ్మెల్యే
Advertisement

Kyatanapalli | మంచిర్యాల జిల్లా క్యాత‌న‌ప‌ల్లి (Kyatanapalli)లో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంద‌ర్భంగా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి మున్సిపల్ ఆఫీసుకు వస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీ కృష్ణ వాహనంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ రాళ్లు రువ్వ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి.

ఈ క్ర‌మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చెల‌రేగింది. అది కాస్త ముదరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజా ప్ర‌తినిధుల‌పై ఇలాంటి దాడులు ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధ‌మ‌ని నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement