CS Ramakrishna Rao | ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు : సీఎస్ రామకృష్ణారావు
CS Ramakrishna Rao | రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం, అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఒకే వేదికపై అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు” రూపకల్పనపై దృష్టి సారించింది.
CS Ramakrishna Rao | రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం, అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఒకే వేదికపై అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు” రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో “ఒకే కార్డు–అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి” అనే విధానంతో కార్యాచరణ రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
రేషన్, పెన్షన్, మహాలక్ష్మి వంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ కార్డుకు అనుసంధానం చేసి ప్రజలకు సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు. అంతేకాకుండా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆరోగ్య ప్రొఫైల్, పెన్షన్ డేటా వంటి కీలక సమాచారాన్ని కూడా ఈ కార్డుతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన సీఎస్, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన నమూనాను రూపొందించాలని సూచించారు. ఈ అంశంపై సమగ్ర ప్రణాళికను రాబోయే 10 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఒకే కార్డు ద్వారా అనేక సేవలు పొందే విధంగా డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, శైలజా రామయ్యర్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తు, సీజీజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రవిగుప్తా, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
మే 30, 2026

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
మే 30, 2026

Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
మే 30, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



