త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Horticulture | మ‌న ఇల్లు – మ‌న కూర‌గాయ‌లు.. 14న శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

Telangana Horticulture | ఇటీవలి కాలంలో చాలా మంది ఆర్గానిక్ ఆహార ఉత్ప‌త్తుల‌పై మ‌క్కువ చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పెరట్లో కానీ, ఇంటిపై కానీ కూర‌గాయల‌ను పండిస్తున్నారు.

S

Telangana | Published On Mar 12, 2026, 4.59 pm IST

Telangana Horticulture | మ‌న ఇల్లు – మ‌న కూర‌గాయ‌లు.. 14న శిక్ష‌ణా కార్య‌క్ర‌మం
Advertisement

Telangana Horticulture | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవలి కాలంలో చాలా మంది ఆర్గానిక్ ఆహార ఉత్ప‌త్తుల‌పై మ‌క్కువ చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పెరట్లో కానీ, ఇంటిపై కానీ కూర‌గాయల‌ను పండిస్తున్నారు. అయితే తెలంగాణ హార్టిక‌ల్చ‌ర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో అర్బ‌న్ ఫామింగ్‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు రెడ్ హిల్స్‌లోని తెలంగాణ హార్టిక‌ల్చ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌న ఇల్లు మ‌న కూర‌గాయ‌లు అని నామ‌క‌ర‌ణం చేశారు.

ఎలాంటి ర‌సాయ‌నాలు వినియోగించ‌కుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లో కూర‌గాయ‌లు ఎలా పండించాలో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఈ శిక్ష‌ణ‌కు హాజ‌రయ్యే ఔత్సాహికులు రూ. 100తో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేర‌కు తెలంగాణ హార్టిక‌ల్చ‌ర్, సెరిక‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌దిత‌ర వివ‌రాల కోసం 8977714411 / 8688848714 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement