త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman Kumar | మహనీయుల విగ్రహాల ఏర్పాట్లలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి

Adluri Laxman Kumar | మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On May 29, 2026, 10.01 pm IST

Adluri Laxman Kumar | మహనీయుల విగ్రహాల ఏర్పాట్లలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి
Advertisement

Adluri Laxman Kumar | మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు. విగ్రహాలు కేవలం శిల్పాలు కాదని, అవి సామాజిక చైతన్యానికి, స్వాభిమానానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీకలని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దళితులు, గిరిజనులు, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న స్థల సమస్యలు, అనుమతుల జాప్యం, రెవెన్యూ మరియు పోలీసు సంబంధిత సమస్యలపై దళిత సంఘాల ప్రతినిధులు సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి, ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటులో ఎలాంటి అనవసర జాప్యం జరగకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా లేని స్థలాల విషయంలో ముందుగానే సంబంధిత సంఘాలకు స్పష్టమైన నోటీసులు ఇవ్వాలని మంత్రి తెలిపారు. చివరి నిమిషంలో అభ్యంతరాలు తలెత్తితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, దళిత సంఘాలతో చర్చించి ముందస్తు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని, శాంతి భద్రతలతో పాటు ప్రజల మనోభావాలను గౌరవించాలని చెప్పారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు తలెత్తితే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రతిబింబించిన సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ స్పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకమని మంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్, ఫూలే, జగజీవన్ రామ్ ఆశయాలే ప్రభుత్వానికి దిశానిర్దేశమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, పోలీసు, రెవెన్యూ శాఖల ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement