Sharada Peetham | శారదా పీఠం భూములపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Sharada Peetham | కోకాపేటలో శారదా పీఠం భూములపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను శారదా పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కోకాపేట భూములు పీఠానికే
జలమండలికి కేటాయింపులు రద్దు
సరైన సమాచారం ఇవ్వలేదని సీఎం ఆగ్రహం
Sharada Peetham | త్రినేత్ర.న్యూస్ : కోకాపేటలో శారదా పీఠం భూములపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను శారదా పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జలమండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. జల మండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి, పీఠం ప్రతినిధులకు సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




