త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pitru Paksha 2026 | రేప‌టి నుంచి పితృప‌క్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..

Pitru Paksha 2026 | పితృప‌క్షాలు సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. పితృదేవతలకు తర్పణం, పిండప్రదానం, శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు ఈ కాలాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. పితృపక్షంలో పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ వారిని ఆశీర్వదిస్తారన్నది హిందూ ధార్మిక విశ్వాసం.

P

Devotional | Published On Sep 25, 2026, 9.14 pm IST

Pitru Paksha 2026 | రేప‌టి నుంచి పితృప‌క్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
Advertisement

Pitru Paksha 2026 | పితృప‌క్షాలు సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. పితృదేవతలకు తర్పణం, పిండప్రదానం, శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు ఈ కాలాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. పితృపక్షంలో పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ వారిని ఆశీర్వదిస్తారన్నది హిందూ ధార్మిక విశ్వాసం. పితృదేవతలకు శాంతి చేకూరాలని, కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని ఈ సమయంలో శ్రాద్ధ కర్మలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. పితృపక్షం 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో కొన్ని నియమాలను పాటించాలని పెద్దలు చెబుతారు. పితృదేవతలను స్మరించుకుంటూ సాత్విక ఆహారం తీసుకోవడంతో పాటు పంచగ్రాసాలను సమర్పించడం కూడా సంప్రదాయంగా వస్తోంది.

పాటించాల్సిన నియమాలు

  • పితృపక్షంలో జుట్టు, గోర్లు కత్తిరించడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని ధార్మిక విశ్వాసం ఉంది. అందువల్ల ఈ 15 రోజుల్లో వీటిని కత్తిరించకుండా ఉండే సంప్రదాయం ఉంది.
  • పితృదేవతల ఆత్మశాంతి కోసం తర్పణం, పిండప్రదానం, శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు నిర్వహిస్తారు. వీటిని విధివిధానాలతో చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
  • పితృపక్షంలో కొత్త పనులు ప్రారంభించడం, వివాహం వంటి శుభకార్యాలు నిర్వహించడం, గృహప్రవేశం, ముండనం వంటి కార్యక్రమాలు చేపట్టడం సంప్రదాయంగా నివారిస్తారు. అలాగే ఈ సమయంలో కొత్త వస్తువుల కొనుగోళ్లు, పెద్ద ఎత్తున మతపరమైన యాత్రలు చేయకుండా ఉండే ఆచారం కూడా ఉంది.
  • ఈ 15 రోజుల్లో సాదాసీదా, సాత్విక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని వీలైనంత వరకు నివారించడం సంప్రదాయంగా పాటిస్తారు.
  • భోజనం చేసే ముందు మొదటి భాగాన్ని ఆవు, కుక్క, కాకి, దేవతలు, చీమలకు సమర్పిస్తారు. దీనినే పంచగ్రాసం అంటారు. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం.

Advertisement
Advertisement