త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Govt | ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్

Congress Govt | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ తొలి విడతగా రూ.2,000 కోట్ల నిధులను విడుదల చేసింది.

P

Telangana | Published On May 29, 2026, 9.35 pm IST

Congress Govt | ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్
Advertisement

Congress Govt | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ తొలి విడతగా రూ.2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా తొలి అడుగుగా ఈ నిధుల విడుదల జరిగింది.

ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తూ నిధుల విడుదలను ఖరారు చేశారు. ఈ విడతలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను 100 శాతం చెల్లించగా, మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తిగా విడుదల చేసింది. ముందస్తు ప్రణాళిక, స్పష్టమైన కార్యాచరణతోనే ఈ చెల్లింపులు సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement