త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghuram Rajan | నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు : రఘురామ్‌రాజన్‌

Raghuram Rajan | నైపుణ్యాలు పెంపొందించుకుంటే అనేక రంగాల్లో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధికి పోషకాహార లోపాన్ని తగ్గించడం అత్యవసరమని ఆయన సూచించారు. తెలంగాణ భవిష్యత్‌ ప్రణాళికపై జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

P

Telangana | Published On May 5, 2026, 9.54 pm IST

Raghuram Rajan | నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు : రఘురామ్‌రాజన్‌
Advertisement

Raghuram Rajan | నైపుణ్యాలు పెంపొందించుకుంటే అనేక రంగాల్లో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధికి పోషకాహార లోపాన్ని తగ్గించడం అత్యవసరమని ఆయన సూచించారు. తెలంగాణ భవిష్యత్‌ ప్రణాళికపై జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వాణీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానాలపైనే పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఆధారపడి ఉంటాయని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూచించారు. విద్యా రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సూచనలు అందించాలని ముఖ్యమంత్రి ఆయనను కోరారు. మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివర్సిటీలు, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తే సమాజానికి మేలు జరుగుతుందని రఘురామ్ రాజన్ తెలిపారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానాలు అమలు చేస్తే పెట్టుబడులను మరింతగా ఆకర్షించవచ్చని సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీగా విద్యుత్, నీటి అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మూడు నుంచి నాలుగు నెలల్లో హైదరాబాద్‌ పర్యటనకు వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూమి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్ వంటి సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయని, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. శాంతిభద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి సమతుల అభివృద్ధిపై దృష్టి సారించామని, ‘క్యూర్, ప్యూర్, రేర్’ మోడల్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సులభతర వ్యాపారానికి అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందని తెలిపారు. ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో పెట్టుబడులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని రఘురామ్ రాజన్‌కు వివరించారు.

Advertisement
Advertisement