Telangana Contractors | సంక్షోభంలో తెలంగాణ కాంట్రాక్టర్లు.. రేవంత్ సర్కార్ రూ. 20 వేల కోట్ల బాకీ
Telangana Contractors | తెలంగాణలోని చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ తెలిపింది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలు తెలంగాణ కాంట్రాక్టర్లకు రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
Telangana Contractors | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ తెలిపింది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలు తెలంగాణ కాంట్రాక్టర్లకు రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ప్రతి బిల్లు ధృవీకరించి, టోకెన్ నంబర్లు జారీ చేయబడ్డాయి.. కానీ ప్రభుత్వం మాత్రం నిధులు చెల్లించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ నెల 18న హైదరాబాద్ నగరంలో మహాసభకు సిద్ధమయ్యారు. పెద్ద గోల్కొండలోని మంత్ర కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు మహాసభ నిర్వహించనున్నారు.

బిల్లుల విడుదల కోసం గత మూడేండ్ల నుంచి డివిజనల్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఆర్థిక శాఖ, ఆర్థిక మంత్రి, ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. 2024, జనవరి నెలలో బిల్డర్స్ కన్వెన్షన్‌లో 2 నుంచి 3 నెలల్లో అన్ని బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఆ హామీ కూడా నెరవేరలేదని గుర్తు చేసింది.

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చిన్న కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. పనులు చేయించుకునేందుకు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లిద్దామంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో కాంట్రాక్టర్లకు భారీగా క్రెడిట్ రేట్ తగ్గింది.. ఇప్పటికే చాలా కంపెనీలు ఎన్‌పీగా ప్రకటించబడ్డాయి.. కొన్ని మూతపడ్డాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఈ క్రమంలో కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు. కొంతమంది కాంట్రాక్టర్లకు గుండెపోట్లు సంభవించాయి. కొందరు ప్రాణాలు తీసుకున్నారు. అప్పులు భరించలేక ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఐఏ డిమాండ్ చేసింది.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivasa Reddy | 5 నుంచి అమల్లోకి రానున్న సవరించిన భూముల ధరలు : మంత్రి పొంగులేటి
జూన్ 3, 2026

NPDCL | లైన్మెన్ కుటుంబానికి రూ. కోటి ప్రమాద బీమా.. చెక్కు అందజేసిన భట్టి విక్రమార్క
జూన్ 3, 2026

Telangana | నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంలో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారం
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



