Telangana | వేటు వేస్తారా.. సర్దిచెబుతారా
Telangana | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత, తనకు అన్యాయం జరిగిందంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన పరుష వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం దూకుడుగా వ్యవహరిస్తుందా? లేదా? అని తెలియాలంటే.. మరో మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే.
మంత్రి సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు సాధ్యమేనా?
బర్తరఫ్ చేయాలంటూ 18 మంది ఎమ్మెల్యేల డిమాండ్
ఇంకా నోరు విప్పని మంత్రులు
త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత, తనకు అన్యాయం జరిగిందంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన పరుష వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం దూకుడుగా వ్యవహరిస్తుందా? లేదా? అని తెలియాలంటే.. మరో మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే. లండన్ పర్యటనలో ఉన్న సీఎం 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న నేపథ్యంలో.. ఆయన రాక తర్వాత నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
2022 నుంచే రేవంత్ పై అసమ్మతి
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగాలు..అసంతృప్తి జ్వాలలు సర్వ సాధారణం. అయితే ఈ సారి మాత్రమే..ఏకంగా బర్తరఫ్,బహిష్కరణ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే 2022 నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా పార్టీలో తీవ్ర అసమ్మతి మొదలైంది. 2021 జూలై 7న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో 2022లో కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమయంలో.. నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ, రాజనర్సింహ, జగ్గారెడ్డిలు తీవ్రంగా స్పందించారు. "కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నది. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్లకు అవకాశాలు రాలేదు. నేను కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యాను" అని ఆ నాడు భట్టి స్పందించారు. "కమిటీల్లో 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా వాళ్లే ఉన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్ధరిస్తాడా" అని ఆనాడు ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. "కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతుంది. క్యారెక్టర్ లేని వారు పార్టీని నడిపిస్తున్నారు" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కీ వ్యాఖ్యానించారు. "మేం నాలుగు పార్టీలు తిరిగి రాలేదు. కాంగ్రెస్ లో పుట్టినం.కాంగ్రెస్ లోపెరిగినం.. కాంగ్రెస్ లో చస్తం" అని రాజనర్సింహ స్పందించారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భట్టి, ఉత్తమ్, రాజ నర్సింమ మంత్రులుగా స్థానం దక్కిన తర్వాత.. బహిరంగంగా ఏనాడూ సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.
బర్తరఫ్ చేస్తారా?
మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ చేయాలంటూ సొంత పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ కు అధిష్టానం అంగీకరిస్తుందా..లేదా అన్న విషయం ఆసక్తి కరంగా మారింది. ఎందుకంటే..ఇటీవలే ఓ జాతీయ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కు నిరాశాజనమకమైన ఫలితాలు వచ్చాయి. పైగా ఆమె సామాజిక వర్గమైన పద్మశాలీయులు, తన భర్త మురళి సామాజిక వర్గమైన మున్నూరు కాపులు.. ఉమ్మడి వరంగల లో బలమైన సంఖ్య కలిగిన వారే. సురేఖను బర్తరఫ్ చేయడం ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాలను అంచనా వేసుకున్న తర్వాతే పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్నారెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత. 2004 ఎన్నికలకు ముందు.. తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం
సోనియా గాంధీని డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే జగిత్యాల లో జీవన్ రెడ్డి రాజీనామా ద్వారా.. కేడర్ ను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ వ్యతిరేకతలు చుట్టూ అలుముకుంటున్న నేపథ్యంలో .. బర్తరఫ్, బహిష్కరణ వంటి డిమాండ్లకు తలొగ్గుతుందా ? అనేది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Congress | అసమ్మతి జ్వాల
- ●Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి.. వైరల్
- ●Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరట..!
- ●OpenAI | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసేజెస్ యాప్లో ఇక చాట్ జీపీటీ..
- ●Uttam Kumar Reddy | ప్రతి రూపాయి రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో చేరాలి
- ●Atomberg IPO | ఆటంబర్గ్ ఐపీవో వచ్చేస్తోంది.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి..

Telangana Congress | అసమ్మతి జ్వాల

Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి.. వైరల్

Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరట..!

OpenAI | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసేజెస్ యాప్లో ఇక చాట్ జీపీటీ..



