Talasani Srinivas Yadav | ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర: తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని సమ్మెకు (RTC Strike) మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 92 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వం ముప్పు తలపెడుతుందని చెప్పారు.
ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ, కృషి వెలకట్టలేనిదని వెల్లడించారు. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడపాలన్నారు. డిమాండ్‌లు అమలయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు అంటున్నారని, అలా మాట్లాడటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ప్రయివేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్‌లు న్యాయమైనవని, వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



