త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | కేటీఆర్ ఓ 420.. బండి సంజ‌య్ ఓ పిట్ట‌ల దొర : పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | కేటీఆర్ ఓ 420గా మారి దొంగ‌ల బ్యాచ్‌కు ముఠా నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. బండి సంజ‌య్ ఓ పిట్ట‌ల దొర మాదిరి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు.

S

Telangana | Published On May 6, 2026, 5.47 pm IST

Mahesh Kumar Goud | కేటీఆర్ ఓ 420.. బండి సంజ‌య్ ఓ పిట్ట‌ల దొర : పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : కేటీఆర్ ఓ 420గా మారి దొంగ‌ల బ్యాచ్‌కు ముఠా నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. బండి సంజ‌య్ ఓ పిట్ట‌ల దొర మాదిరి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు. మ‌హేశ్ కుమార్ గౌడ్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్‌ది దొంగల బ్యాచ్. పాస్ పోర్ట్ కుంభకోణం మొద‌లుకొని భూముల కుంభకోణం వరకు కేటీఆర్ కుటుంబమే ఉంది. కేటీఆర్ నీ స్థాయి ఏంటి... నువ్వా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని విమర్శించేది. ఉద్య‌మంలో దొంగచాటుగా వచ్చిచేరి..కేకే మహేందర్ రెడ్డి గొంతు కోశావు. యువతను మద్యానికి అలవాటు చేసి రాష్ట్ర భవిష్యత్‌ను బీఆర్ఎస్ నాశ‌నం చేసిందని ధ్వ‌జ‌మెత్తారు.

ఏం చేసారని ఒకే కుటుంబంలో ఉన్న వారందరికీ పదవులు. దలితుడిని ముఖ్యమంత్రి చేయకుంటే తల నరుక్కుంటా అన్నారు.. కేసీఆర్‌కు ఇప్పుడు తల ఉందా లేదా..? బీఆర్ఎస్ హాయాంలో జరిగిన ఆగడాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు కేటీఆర్. మాదకద్రవ్యాల ప్రభావంతో కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారనే అనుమానం ఉంది అని మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

బండి సంజయ్ పిట్టల దొరలా మారిండు. సీబీఐకి కేసు అప్పగిస్తే పొడిచేస్తామన్నారు...6 నెలలుగా ఏం చేస్తున్నారు అని టీ పీసీసీ చీఫ్ నిల‌దీశారు.

Advertisement
Advertisement