త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ఏఐసీసీ దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ చీఫ్ : మ‌హేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | పీసీసీ మార్పు విష‌యంలో అధిష్టానానిదే తుది నిర్ణ‌యం అని తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. నేను స‌రైన వ్య‌క్తిని అనే నాకు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చారు. ఏఐసీసీ దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ చీఫ్ అని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On May 23, 2026, 5.21 pm IST

Mahesh Kumar Goud | ఏఐసీసీ దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ చీఫ్ : మ‌హేశ్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : పీసీసీ మార్పు విష‌యంలో అధిష్టానానిదే తుది నిర్ణ‌యం అని తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. నేను స‌రైన వ్య‌క్తిని అనే నాకు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చారు. ఏఐసీసీ దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ చీఫ్ అని ఆయ‌న అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై మ‌హేశ్ గౌడ్ స్పందించారు.

నేను, సీఎం కలిసి పని చేయడం కొందరికి మింగుడుపడడం లేదు. నాపై వచ్చిన కథనాలను నేను పట్టించుకోను, చిన్నాచితక విషయాలపై నా సమయాన్ని వెచ్చించను. అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీడియాకి ఉంది. నాపై ఒక ఛానెల్ ప్రచారం చేస్తే అది ప్రామాణికం కాదు. నా పనితీరుని బేరీజు వేయాల్సింది మా ముఖ్యమంత్రి, కార్య‌క‌ర్త‌లు. నేను పత్రిక స్వేచ్ఛను అర్థం చేసుకున్న వ్యక్తిని అని మ‌హేశ్ గౌడ్ అన్నారు.

ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారుతుంది. బీఆర్ఎస్‌కు దూరదృష్టి లేదు. హైదరాబాద్ పరిధిని పెంచలేదు. సిటీ విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీష్ రావు అంటున్నారా? తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది. స్టాలిన్ లాగే మేము గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను ఏఐసీసీకి పంపించాం. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటిస్తాం. కేబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారు. మంత్రివ‌ర్గ‌ విస్తరణలో నా జోక్యం ఏముండదు అని మ‌హేశ్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement