త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Average Salary in India | దేశంలో సగటు నెలవారీ జీతాల్లో ఢిల్లీదే హవా.. టాప్-4లో నిలిచిన తెలంగాణ

దేశవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల జాబితాలో తెలంగాణ టాప్-4లో నిలిచింది. నెలకు రూ.35 వేల సగటు ఆదాయంతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.

J

National | Published On May 28, 2026, 11.00 pm IST

Average Salary in India | దేశంలో సగటు నెలవారీ జీతాల్లో ఢిల్లీదే హవా.. టాప్-4లో నిలిచిన తెలంగాణ
Advertisement
  • భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సగటు నెలవారీ జీతాలపై (Average Monthly Salaries) ఆసక్తికరమైన డేటా వెల్లడి.
  • నెలకు సగటున రూ.35,000 వేతనంతో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
  • నెలకు రూ.31,000 సగటు జీతంతో తెలంగాణ దేశంలోనే నాలుగో (Top-4) స్థానంలో నిలిచింది.
  • కర్ణాటక (రూ.33,000), మహారాష్ట్ర (రూ.32,000) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. పొరుగు రాష్ట్రం ఏపీ సగటు జీతం రూ.26,000 గా నమోదు

Average Salary in India | త్రినేత్ర.న్యూస్ : భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎంప్లాయీస్ (Employees) అత్యధికంగా జీతాలు తీసుకుంటున్నారనే అంశంపై తాజాగా ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మన తెలంగాణ (Telangana) రాష్ట్రం 'సగటు నెలవారీ జీతాల' (Average Monthly Salaries) జాబితాలో దేశంలోనే టాప్-4లో నిలిచి సత్తా చాటింది. సగటు ఆదాయాల పరంగా చూసుకుంటే ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలే (South Indian states) మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటం విశేషం.

నంబర్ 1 ప్లేస్‌లో ఢిల్లీ.. ఆ తర్వాత ఎవరంటే?

దేశవ్యాప్తంగా ఉద్యోగుల సగటు వేతనాల్లో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటు నెలవారీ జీతం రూ.35,000 గా నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో రెండు ఫైనాన్షియల్ అండ్ ఐటీ హబ్స్ (IT Hubs) నిలిచాయి. బెంగళూరు మహానగరం ఉన్న కర్ణాటక సగటున రూ.33,000 వేతనంతో రెండో స్థానంలో ఉండగా.. ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్ర రూ.32,000 తో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

టాప్-4లో తెలంగాణ.. కారణాలివే!

ఇక తెలంగాణ విషయానికొస్తే.. సగటున నెలకు రూ.31,000 జీతంతో దేశంలోనే నాలుగో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. హైదరాబాద్‌లో (Hyderabad) బహుళజాతి సంస్థల రాక, సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇతర కార్పొరేట్ కంపెనీల విస్తరణే ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. యువతకు ఇక్కడ మెరుగైన ప్యాకేజీలు (Better packages) లభిస్తుండటం ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.

ఏపీ, ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సగటు నెలవారీ జీతం రూ.26,000 గా ఉంది. అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో రూ.29,000, కేరళలో రూ.24,500 గా నమోదైంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో సగటు వేతనం రూ.27,000 గా ఉండగా, గుజరాత్ లో రూ.28,000, పంజాబ్‌లో రూ.25,000 గా ఉంది. బేసిక్ పే, ఇన్సెంటివ్‌లతో కూడిన స్థూల వేతనాల (Gross salaries) ఆధారంగా ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా చూస్తే, స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు (Skilled professionals) దక్షిణాది రాష్ట్రాలు బెస్ట్ డెస్టినేషన్‌గా మారుతున్నాయని చెప్పొచ్చు.

 

Average Monthly Salaries in India Telangana in Top 4 Delhi Ranks First

Advertisement

తాజావార్తలు

Advertisement