త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stamps and Registrations | 26 నుంచి 28 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ సేవ‌ల‌కు తాత్కాలిక విరామం

Stamps and Registrations | స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

S

Telangana | Published On Jun 19, 2026, 5.09 pm IST

Stamps and Registrations | 26 నుంచి 28 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ సేవ‌ల‌కు తాత్కాలిక విరామం
Advertisement

Stamps and Registrations | త్రినేత్ర‌.న్యూస్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం కోసం ఈ తాత్కాలిక విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.

అయితే జూన్ 26న మొహ‌ర్రం, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.

ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement