త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SCR | ఇండిగో సంక్షోభం.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్లు

SCR | ఇండిగో( Indigo ) విమాన స‌ర్వీసులు దేశ వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రం నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన ప్ర‌యాణికుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే( SCR ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Dec 6, 2025, 7.51 am IST

SCR | ఇండిగో సంక్షోభం.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్లు
Advertisement

SCR | హైద‌రాబాద్ : ఇండిగో( Indigo ) విమాన స‌ర్వీసులు దేశ వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రం నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన ప్ర‌యాణికుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే( SCR ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ, రేపు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది.

చ‌ర్ల‌ప‌ల్లి - శాలిమార్ స్పెష‌ల్ (07148) ప్ర‌త్యేక రైలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నుంది. ఇవాళ రాత్రికి 9.35 గంట‌ల‌కు చ‌ర్ల‌పల్లి నుంచి బ‌య‌ల్దేర‌నుంది. ఈ ప్ర‌త్యేక రైలులో ఏసీ, స్లీప‌ర్, జ‌న‌ర‌ల్ కోచ్‌లు క‌లిపి మొత్తం 1566 సీట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి.

సికింద్రాబాద్ - చెన్నై ఎగ్మోర్ స్పెష‌ల్ (07146) సాయంత్రం 6.40 గంట‌ల‌కు బ‌య‌ల్దేర‌నుంది. ఈ రైలులో 1,063 బెర్త్‌లు అందుబాటులోకి రానున్నాయి. హైద‌రాబాద్ - ముంబై ఎల్‌టీటీ స్పెష‌ల్ (07150) రాత్రి 8.25 గంట‌ల‌కు బ‌యల్దేర‌నుంది. ఈ రైలులో 1080 ఏసీ-3 టైర్ బెర్త్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement