త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Form house Death | ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Form house Death | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన గుండ్ల మధు(27)గా గుర్తించారు.

S

Telangana | Published On Jun 14, 2026, 3.28 pm IST

Form house Death | ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
Advertisement

Form house Death | త్రినేత్ర‌.న్యూస్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన గుండ్ల మధు(27)గా గుర్తించారు. అత‌డు న‌గ‌రంలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ కావ‌డంతో సంస్థ ఉద్యోగులు 15 మంది శ‌నివారం సాయంత్రం ఫామ్‌హౌజ్‌లో గెట్ టు గెద‌ర్ పార్టీ జ‌రుపుకున్నారు.

ఆదివారం ఉద‌యం లేచేస‌రికి మ‌ధు విగ‌త‌జీవిగా క‌నిపించారు. దీంతో అక్క‌డున్న‌వారు ఒక్క‌సారి ఖంగుతిని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మ‌ధు శ‌రీరంపై గాయాలు క‌నిపించిన‌ట్లు స‌మాచారం. అక్క‌డికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై మ‌ధు తండ్రి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement