మహేశ్ గౌడ్ గారూ.. మీ పార్టీని జనం ఉప్పు పాతర వేస్తారు
అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం. మీడియా, ప్రజల కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను... It’s absolutely a silly case, it’s a frivolous case. జరిగింది ఏమీ లేదు తప్పు, కాబట్టి వారు మళ్ళీ పిలుస్తారని నేనైతే అనుకోవడం లేదు వ్యక్తిగతంగా. కానీ మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ సహకరిస్తాం. మాకేమీ నష్టం లేదు, మేము చేసిన తప్పు ఏమీ లేదు.
మహేశ్ గౌడ్ గారూ.. మీ పార్టీని జనం ఉప్పు పాతర వేస్తారు
మీరే సిట్ చైర్మన్ గా ప్రకటించుకోండి
పోలీసుల కంటే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు
ప్రశ్నలు మీరూ, మంత్రులు కలిపి పంపుతున్నారా
మీకు రాజకీయ కాలక్షేపమని చెప్పండి
కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఫైర్
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (PCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై బీఆర్ ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మహేశ్‌కుమార్ గౌడ్ పంపుతున్న ప్రశ్నలే పోలీసులు అడుగుతున్నట్టుగా అభిప్రాయపడ్డారు. పీసీసీ, మంత్రులు కలిసి ఈ నాటకం ఆడుతున్నారంటూ విమర్శించారు. కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..
👉🏿 మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతా ఉన్నాయి, సోమవారం చివరి రోజు నామినేషన్ విత్ డ్రాయల్స్ కి, ఇంకా ఇతరత్రా కార్యక్రమానికి బి-ఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ 'కాక్ అండ్ బుల్ స్టోరీ' (Cock and bull story) ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, వాళ్ళ కెసిఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వండి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు, వారికి ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలని చూస్తా ఉంటే బాగా అర్థం కావట్లేదు.
👉🏿 ఈ అసత్య కథనాలు, ఈ లీకులు, ఈ అబద్ధాలు, ఈ 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అనే పనికిమాలిన వ్యవహారం అంతా చూస్తా ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పిసిసియా లేక బిజెపియా అది కూడా మాకు అర్థం కావట్లేదు.
👉🏿 పెద్దాయన కేసీఆర్(KCR) గారు రెండు సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు.
👉🏿 కాబట్టి మాకు మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్‌కు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి, తేటతెల్లమై ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్లు తెరుచుకొని ఉంటాయి.
👉🏿 నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒక్కటే... ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏదీ జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పి ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు
👉🏿 అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం. మీడియా, ప్రజల కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను... It’s absolutely a silly case, it’s a frivolous case. జరిగింది ఏమీ లేదు తప్పు, కాబట్టి వారు మళ్ళీ పిలుస్తారని నేనైతే అనుకోవడం లేదు వ్యక్తిగతంగా. కానీ మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ సహకరిస్తాం. మాకేమీ నష్టం లేదు, మేము చేసిన తప్పు ఏమీ లేదు.
👉🏿 మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒక్కటే అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ (ED) విచారణకు పిలిస్తే మరి రాజ్‌భవన్ ముందు మీ ముఖ్యమంత్రి, మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? పాపం మేము కూడా అందుకే ధర్నా చేశాం. మా నాయకుణ్ణి మరి ఇక్కడ పనికిమాలిన విచారణల పేరిట పిలిచి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు... ఆయన్ని పట్టుకొని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్‌గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆయన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా. తప్పేముంది అందులో?
👉🏿 కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అది ఏదో ప్రకటించుకోండి, మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు సిట్ వాళ్ళ కంటే ఎక్కువ. పోలీసులెవరూ మాట్లాడటం లేదు, ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు... అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి. అదేదో మీరే చెప్పండి బహిరంగంగా, 'మేమే పంపుతున్నాం, మేమే నడుపుతున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం' అని చెప్పండి ధైర్యంగా, ఏముంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



