త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ వేయండి.. ఐపీఎస్‌లు సీఎం మాట వినొద్దు: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్

RS Praveen Kumar | కేటీఆర్ (KTR), హరీశ్‌ రావు (Harish Rao) ఫోన్లు, వారి ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని.. దీనిపై సిట్ (SIT) వేసి విచారణ జరిపించాల‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఐపీఎస్‌లు సీఎం రేవంత్ (CM Revanth) మాట వినొద్ద‌ని సూచించారు.

S

Telangana | Published On Apr 30, 2026, 3.17 pm IST

RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ వేయండి.. ఐపీఎస్‌లు సీఎం మాట వినొద్దు: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్
Advertisement

- ఏ ప్ర‌భుత్వం ఉన్నా ట్యాపింగ్ జ‌రుగుతుంది
- నాకూ ఓ యాపిల్ ఫోన్ నుంచి మెసేజ్ వ‌చ్చింది
- 350 మందిని విచారించి ఇప్పటికీ ఛార్జ్ షీట్ వేయ‌లే
- కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ఇళ్ల‌ల్లోని సీసీ కెమెరాల‌ను హ్యాక్ చేస్తున్న‌రు
- రేవంత్ పాల‌న‌లో పోలీసులు బ‌ల‌వుతున్న‌రు
- కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ధ్వజం

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్ (KTR), హరీశ్‌ రావు (Harish Rao) ఫోన్లు, వారి ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని.. దీనిపై సిట్ (SIT) వేసి విచారణ జరిపించాల‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్ల‌డారు. ఐపీఎస్‌లు సీఎం రేవంత్ (CM Revanth) మాట వినొద్ద‌ని సూచించారు. బెంగుళూరు నుంచి ప్రయివేటు హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నార‌ని ఆరోపించారు.

కేసీఆర్ ఉంటే ఢిల్లీ మెడ‌లు వంచేవారు..

రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్న‌రు? ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే ఢిల్లీ మెడలు వంచేవారు. సీఎం రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి అని ఆర్ఎస్పీ అన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావును ఇరికించే యత్నం..

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావును ఇరికించాలని రెండవ సిట్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్న‌రు. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్ రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ ఒత్తిడి తెస్తున్నారు అని ఆయ‌న ఆరోపించారు.

హ‌రీశ్‌రావు పేరు చెప్పాల‌ని బెదిరిస్తున్న‌రు..

సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీశ్‌రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు. కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. భాద్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్మెంట్ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. నంబీ నారాయణన్ అనే ఇస్రో సైంటిస్ట్ పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్ల‌ను కోర్టు దోషులుగా ప్రకటించింది అని ప్ర‌వీణ్‌కుమార్ చెప్పారు.

క్రిశాంక్ పై కేసు పెట్టి జైలుకు పంపారు. కేటీఆర్, హరీశ్‌ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రయివేటు హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలి. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చాను అని ఆర్ఎస్పీ వెల్ల‌డించారు.

Advertisement
Advertisement