Chiranjeevi | 35 వసంతాల చిరంజీవి రౌడీ అల్లుడు – మొదట అనుకున్న టైటిల్ ఆటోజానీ – సాయిధరమ్‌తేజ్ తండ్రి నిర్మాత
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మాస్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన రౌడీ అల్లుడు మూవీ విడుదలై నేటికి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలుత ఆటోజానీ అనే టైటిల్ అనుకున్నారు. ఈ సినిమాకు సాయిధరమ్‌తేజ్ తండ్రి పంజా ప్రసాద్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.
Entertainment | Published On Oct 18, 2026, 7.54 pm IST
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాల్లో రౌడీ అల్లుడు ఒకటి. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1991 అక్టోబర్ 18న ఈ థియేటర్లలోకి వచ్చింది. నేటితో ఈ సినిమా రిలీజై 35 ఏళ్లు పూర్తయ్యాయి. రౌడీ అల్లుడు సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు చిరంజీవి. శోభన, దివ్యభారతి హీరోయిన్లుగా కనిపించారు.
డైలాగ్ ఫేమస్...
చిరంజీవి నటన, మాస్ డైలాగ్స్‌తో పాటు బప్పిలహరి మ్యూజిక్, రాఘవేంద్రరావు టేకింగ్ వెరసి ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. బాక్స్ బద్దలైపోతుంది అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అప్పట్లో ఊతపదంగా మారిపోయింది.
సాయిధరమ్‌తేజ్ తండ్రి...
రౌడీ అల్లుడు సినిమాకు చిరంజీవి తోడల్లుడు కే వెంకటేశ్వరరావుతో పాటు బావ పంజా ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. పంజా ప్రసాద్ తనయులు సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్ ప్రస్తుతం హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. రౌడీ అల్లుడు కోసమే శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ పేరుతో ఓ బ్యానర్‌ను స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థపై వచ్చిన ఒకే ఒక మూవీ ఇదే.
ఆటో జానీ...
రౌడీ అల్లుడు సినిమాకు మొదట ఆటోజానీ అనే టైటిల్‌ను అనుకున్నారు. ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పేరు కూడా పరిశీలించారు. కానీ మాస్ ఆడియెన్స్‌కు చేరువ కాదనే ఆలోచనతో రౌడీ అల్లుడుగా మార్చేశారు. ఈ టైటిల్‌పై అప్పట్లో అల్లు రామలింగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
దళపతి విజయ్ సినిమాలో...
స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు మూవీ ఇదే. బడ్జెట్ పరిమితుల కారణంగా తక్కువ మందితో స్విట్జర్లాండ్ షెడ్యూల్ జరిపారు. చిరంజీవికి మేకప్‌మెన్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అల్లు అరవింద్ పనిచేశారు.
రౌడీ అల్లుడు సినిమాలోని అమలాపురం బుల్లోడా అనే సాంగ్‌ను దళపతి విజయ్ రసికన్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా టబును కూడా అనుకున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలి : హరీశ్‌రావు
అక్టోబర్ 18, 2026

Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి
అక్టోబర్ 18, 2026

Bengaluru Airport Vancouver Airport | వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌తో బెంగుళూరు విమానాశ్రయం కీలక ఒప్పందం.. త్వరలో డైరెక్ట్ ఫ్లైట్స్!
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలి : హరీశ్‌రావు
- ●Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి
- ●Bengaluru Airport Vancouver Airport | వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌తో బెంగుళూరు విమానాశ్రయం కీలక ఒప్పందం.. త్వరలో డైరెక్ట్ ఫ్లైట్స్!
- ●Osmania University PhD Entrance Test | నవంబర్ 14 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్షలు
- ●France Protests 2026 | భగ్గుమన్న ఫ్రాన్స్.. చారిత్రక భవనం దగ్ధం.. రోడ్డెక్కిన 8 లక్షల మంది
- ●Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేసీఆర్‌పై తప్పుడు కథనాలు

Harish Rao | ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలి : హరీశ్‌రావు

Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి

Bengaluru Airport Vancouver Airport | వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌తో బెంగుళూరు విమానాశ్రయం కీలక ఒప్పందం.. త్వరలో డైరెక్ట్ ఫ్లైట్స్!

Osmania University PhD Entrance Test | నవంబర్ 14 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్షలు



