Harish Rao | ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలి : హరీశ్‌రావు
Harish Rao | బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ( Bathukamma ), దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా పండుగ( Dasara Festival ) రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో విజయాలను అందించాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ( Bathukamma ), దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా పండుగ( Dasara Festival ) రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో విజయాలను అందించాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు, తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై నేడు సద్దుల బతుకమ్మతో ముగించుకుంటున్నాం. బతుకమ్మ పండుగ మన తెలంగాణకు ప్రత్యేకం. ప్రపంచ వ్యాప్తంగా మన అక్కాచెల్లెళ్లు ఏ దేశంలో ఉన్న, ఏ నగరంలో ఉన్నా కూడా ఈ బతుకమ్మ పండుగను చక్కగా నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతిని, వైభవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఈ పండుగ తెలంగాణకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా ఆడబిడ్డలు కులమతాలకు అతీతంగా సంప్రదాయబద్దంగా అందరూ కలిసిమెలిసి బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. చెడుపై విజయానికి సంకేతంగా దసరాను జరుపుకుంటాం. ఈ దసరా మీకు ఎన్నో విజయాలను అందించాలని మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆ దుర్గామాతను మనసారా ప్రార్థిస్తున్నాను. ఎల్‌నినోతో ఈ దేశ, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రైతాంగం బాధలు తొలగిపోవాలని మనసారా ప్రార్థిస్తూ అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి
అక్టోబర్ 18, 2026

Osmania University PhD Entrance Test | నవంబర్ 14 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్షలు
అక్టోబర్ 18, 2026

Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేసీఆర్‌పై తప్పుడు కథనాలు
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి
- ●Bengaluru Airport Vancouver Airport | వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌తో బెంగుళూరు విమానాశ్రయం కీలక ఒప్పందం.. త్వరలో డైరెక్ట్ ఫ్లైట్స్!
- ●Osmania University PhD Entrance Test | నవంబర్ 14 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్షలు
- ●France Protests 2026 | భగ్గుమన్న ఫ్రాన్స్.. చారిత్రక భవనం దగ్ధం.. రోడ్డెక్కిన 8 లక్షల మంది
- ●Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేసీఆర్‌పై తప్పుడు కథనాలు
- ●Anupama Parameswaran | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్

Bandla Ganesh | మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గణేశ్ విజ్ఞప్తి

Bengaluru Airport Vancouver Airport | వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌తో బెంగుళూరు విమానాశ్రయం కీలక ఒప్పందం.. త్వరలో డైరెక్ట్ ఫ్లైట్స్!

Osmania University PhD Entrance Test | నవంబర్ 14 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్షలు

France Protests 2026 | భగ్గుమన్న ఫ్రాన్స్.. చారిత్రక భవనం దగ్ధం.. రోడ్డెక్కిన 8 లక్షల మంది



