త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandla Ganesh | మొక్క‌జొన్న‌, సోయాబీన్ ధ‌ర‌లు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గ‌ణేశ్ విజ్ఞ‌ప్తి

Bandla Ganesh | తెలంగాణలో మొక్కజొన్నలు, సోయాబీన్, డీఓసీ (DOC)తో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన ఇతర ముడిసరుకులను స్టాకిస్టులు గోడౌన్లలో నిల్వ ఉంచి, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేశ్( Bandla Ganesh ) విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Oct 18, 2026, 7.24 pm IST

Bandla Ganesh | మొక్క‌జొన్న‌, సోయాబీన్ ధ‌ర‌లు పెంచకండి సీఎం రేవంత్ గారూ.. బండ్ల గ‌ణేశ్ విజ్ఞ‌ప్తి
Advertisement

Bandla Ganesh | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో మొక్కజొన్నలు, సోయాబీన్, డీఓసీ (DOC)తో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన ఇతర ముడిసరుకులను స్టాకిస్టులు గోడౌన్లలో నిల్వ ఉంచి, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేశ్( Bandla Ganesh ) విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు బండ్ల గ‌ణేశ్ ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు.

పౌల్ట్రీ రైతులకు అవసరమైన ముడిసరుకులు సకాలంలో, న్యాయమైన ధరలకు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులతో పర్యవేక్షణ చేయించాలని కోరుతున్నామ‌న్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ రైతులపై అదనపు భారం పడకుండా, నిల్వల పేరుతో ధరలు పెంచే పరిస్థితులను నివారించి, రైతులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని వినమ్రంగా కోరుతున్నాన‌ని పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమను, రైతుల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మా హృదయపూర్వక విజ్ఞప్తి అని బండ్ల గ‌ణేశ్ తెలిపారు.

Advertisement
Advertisement