Yadagirigutta | యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు.. ఎట్టకేలకు పట్టాలెక్కనున్న పనులు
Yadagirigutta | త్రినేత్ర.న్యూస్: సుమారు 9 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు ఇక పట్టాలెక్కనుంది. త్వరలోనే యాదగిరిగుట్టకు (Yadagirigutta) ఎంఎంటీఎస్ రైలు (MMTS Train) కూతపెట్టనుంది. దీంతో హైదరబాద్ నగరం నలు మూలల నుంచి యాదగిరిశుని చెంతకు సులభంగా చేరుకోవచ్చు.
Yadagirigutta | త్రినేత్ర.న్యూస్: సుమారు 9 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు ఇక పట్టాలెక్కనుంది. త్వరలోనే యాదగిరిగుట్టకు (Yadagirigutta) ఎంఎంటీఎస్ రైలు (MMTS Train) కూతపెట్టనుంది. దీంతో హైదరబాద్ నగరం నలు మూలల నుంచి యాదగిరిశుని చెంతకు సులభంగా చేరుకోవచ్చు. ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే లక్ష్మీనారసింహ స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు డబ్బుతోపాటు సమయం కూడా ఆదా కానుంది.
రాజధాని నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాని వెళ్లే యాత్రికులకు సునాయాస ప్రయాణానికి ఎంఎంటీఎస్ రైలు సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. తొమ్మిదేండ్ల క్రితం పక్కకు పడేసిన ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఈ టెండర్లను దక్కించుకుంది. ఇప్పటికే భూసేకరణ పూర్తికావడంతో త్వరలో పనులను ప్రారంభించనుంది. రెండున్నరేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఎంఎంటీఎస్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రాయగిరి వరకు సుమారు 33 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.430 కోట్లకుపైగా రైల్వేశాఖ వెచ్చించనుంది.

2015లోనే సర్వే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆలయాన్ని పునఃనిర్మించింది. అదేవిధంగా భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పించేందుకు ఎంఎంటీఎస్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో 2015లోనే క్షేత్రస్థాయిలో సర్వే ప్రణాళికలకు సిద్ధం చేశారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో దీనిని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ వరకే పరిమితం చేశారు. వ్యయ భారంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం వహించాక తాత్సారం చేయడంలో ఘట్‌కేసర్ నుంచి రాయగిరి మధ్య 33 కి.మీ రైలు మార్గం నిర్మితం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో మొత్తం వ్యయాన్ని భరించాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే ఆర్వీఎన్ఎల్ పనులను దక్కించుకున్నది.
సమయం ఆదా..
ప్రస్తుతం ఘట్‌కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని యాదగిరిగుట్టకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి రైల్వే స్టేషన్ వరకు పొడిగించనున్నారు. ఈ మార్గంతో సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి 45 నిమిషాల్లో చేరొచ్చు. తద్వారా సమయంతో పాటు రవాణా ఖర్చులు ఆదా అవుతాయి.
నగరంలో ఎక్కడి నుంచైనా..
ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ఎక్కడి నుంచైనా సులభంగా యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. పటాన్‌చెరు, తెల్లాపూర్, లింగంపల్లి, ఉందానగర్, మేడ్చల్ తదితర హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో రాయగిరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 4 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే పుణ్యక్షేత్రానికి వెళ్లవచ్చు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




