త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC JAC | ఆర్టీసీ స‌మ్మె నోటీసు అంద‌జేత‌.. 14 రోజుల త‌ర్వాత నిర్ణ‌యం

RTC JAC | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు డిమాండ్‌ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులిచ్చారు.

S

Telangana | Published On Mar 13, 2026, 9.14 pm IST

RTC JAC | ఆర్టీసీ స‌మ్మె నోటీసు అంద‌జేత‌.. 14 రోజుల త‌ర్వాత నిర్ణ‌యం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు డిమాండ్‌ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులిచ్చారు. ఆర్టీసీ ఎండీ లేకపోవడంతో శుక్ర‌వారం పేషీలోనే సమ్మె నోటీసు (Strike Notice) అంద‌జేశారు. 14 రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలి...

తమ పెండింగ్‌ సమస్యల(Pending issues) ను పరిష్కరించ‌కుంటే అసెంబ్లీ (Assembly) ని ముట్టడిస్తామని గత నెలలో ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించాల‌ని జేఏసీ నాయ‌కులు డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎరియర్స్‌ను ఇంకా చెల్లించలేద వాపోయారు. ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాల‌ని, కార్మికులకు ఉద్యోగ భద్రత (Job security) కల్పించాలని విజ్ఙ‌ప్తి చేశారు. ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు (Elections) జరపాలని చెప్పారు. దీంతో పాటు అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై పనిభారం తగ్గించాల‌ని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement