త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఒకే రోజు RRB, TET పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు

RS Praveen Kumar | తెలంగాణ టెట్ (TET), ఆర్ఆర్బీ (RRB) పరీక్షలు ఒకే రోజున ఉన్నాయ‌ని, దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) చెప్పారు. ఒకే రోజు రెండు ప‌రీక్ష‌లు ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఏదో ఒక దానిని వ‌దులు కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు.

G

Telangana | Published On Jun 14, 2026, 10.29 am IST

RS Praveen Kumar | ఒకే రోజు RRB, TET పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ టెట్ (TET), ఆర్ఆర్బీ (RRB) పరీక్షలు ఒకే రోజున ఉన్నాయ‌ని, దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) చెప్పారు. ఒకే రోజు రెండు ప‌రీక్ష‌లు ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఏదో ఒక దానిని వ‌దులు కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఈ నెల 17న టీజీ టెట్ ప‌రీక్ష ఉన్న విష‌యం తెలిసిందే. అదే రోజున ఆర్ఆర్బీ ప‌రీక్ష కూడా ఉన్న‌ది.

ఈ నేప‌థ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగ యువత ఒకే రోజు రెండు కీలక పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో నెలలుగా కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్ష తేదీని పునఃపరిశీలించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నార‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement