Congress | డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసిన రాహుల్‌గాంధీ
Congress | రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులకు పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ హరిత రిసార్ట్‌లో “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు.
Congress | త్రినేత్ర.న్యూస్ : రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులకు పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ హరిత రిసార్ట్‌లో “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి రాహుల్‌తో పాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. పది రోజులపాటు కొనసాగిన ఈ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు తమ తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, సోషల్ మీడియా, మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణ అందించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో శిక్షణా శిబిరం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు వచ్చిన రాహుల్‌కు రేవంత్ స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక హెలికాప్టర్‌లో వికారాబాద్‌కు వెళ్లి, కార్యక్రమ అనంతరం అదే హెలికాప్టర్‌లో తిరిగి బేగంపేట చేరుకున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



