High Speed Rail Corridor | హైస్పీడ్ రైలు కారిడార్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి: అధికారులకు సీఎస్ ఆదేశం
High Speed Rail Corridor | హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ (High Speed Rail Corridor) ప్రాజెక్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. లంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
CS Ramakrishna Rao | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ (High Speed Rail Corridor) ప్రాజెక్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాజెక్టు రిపోర్టులు, ప్రాజెక్టు అమలులో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి..
హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని చెప్పారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి మేలు చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు సీఎస్‌కు పలు వివరాలను తెలియజేశారు.

93 కిలో మీటర్లు భూమి అవసరం...
హైదరాబాద్ - పుణే - ముంబై హై స్పీడ్ రైల్ మార్గానికి సంబంధించి డి.పి.ఆర్ సిద్ధం అయ్యిందని రైల్వే అధికారులు తెలిపారు. సూమారు 671 కిలో మీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణలో 93 కిలో మీటర్లు భూ సేకరణ అవసరం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ - బెంగళూరు కారిడార్, హైదరాబాద్- చెన్నై కారిడార్ లో సూమారు 123 కిలో మీటర్ల నిడివిలో భూసేకరణ అవసరమని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలలో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని పేర్కొన్నారు. వీటికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ, హెచ్ఎండీఏ, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు కేంద్ర రైల్వే ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకొని హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కు సహకరించాలని సీఎం సూచించారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కేంద్ర రైల్వే శాఖ అధికారులు, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




