త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prajavani | ప్రజా స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించే వేదిక‌గా ప్ర‌జావాణి.. శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో చిన్నారెడ్డి

Prajavani | రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజావాణి అధికారులకు హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి నిర్వహణ, విధివిధానాలపై సీఎం ప్రజావాణి ఇంచార్జ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్‌ నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

P

Telangana | Published On May 8, 2026, 8.30 pm IST

Prajavani | ప్రజా స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించే వేదిక‌గా ప్ర‌జావాణి.. శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో చిన్నారెడ్డి
Advertisement

Prajavani | రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజావాణి అధికారులకు హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి నిర్వహణ, విధివిధానాలపై సీఎం ప్రజావాణి ఇంచార్జ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్‌ నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ ప్రత్యేక తరగతులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమంగా ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ శిక్షణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర స్థాయి వరకు ప్రజావాణి వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశాల మేర‌కు భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే వేదికగా ప్రజావాణి కార్యక్రమం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రజావాణి సెల్‌లను ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ ర్యాంక్‌ అధికారిని ఇంచార్జ్‌గా నియమించగా, టెక్నికల్‌ టీమ్‌, ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్లు, సిబ్బంది ప్రజావాణి సెల్‌లను పర్యవేక్షించనున్నారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజావాణి అధికారులు అనంతరం సీఎం ప్రజావాణి ఇంచార్జ్‌ డాక్టర్ జీ చిన్నారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్రానికి కొత్తగా కేటాయించిన ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు కూడా శుక్రవారం సీఎం ప్రజావాణిని సందర్శించారు. ప్రజావాణి అమలు తీరును పరిశీలించడంతో పాటు ప్రవాసి ప్రజావాణి పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. కాగా, శుక్రవారం సీఎం ప్రజావాణిలో మొత్తం 281 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement