త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | రాజ‌కీయంగా నాకొక ఖ‌త‌ర్నాక్ కోరికుంది.. అదేందో న‌వంబ‌ర్‌లో చెప్తా.. వెరీ సీరియ‌స్ ఇది

Jagga Reddy | రాజ‌కీయంగా నాకొక ఖ‌త‌ర్నాక్ కోరిక ఉంద‌ని.. అదేందో న‌వంబ‌ర్‌లో చెప్తాన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాకు సీఎం కావాల‌ని లేద‌ని.. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి దానికి ఎప్ప‌టికీ ట్రై చేస్తూనే ఉంట‌డ‌న్నారు. వ‌చ్చే నాలుగు నెల‌ల్లో నాకు కొంత‌ క్లారిటీ వ‌స్తుంద‌ని.. అప్పుడు మ‌న‌సులో ఉన్న విష‌యాల‌న్నీ బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు.

S

Telangana | Published On Jul 30, 2026, 2.20 pm IST

Jagga Reddy | రాజ‌కీయంగా నాకొక ఖ‌త‌ర్నాక్ కోరికుంది.. అదేందో న‌వంబ‌ర్‌లో చెప్తా.. వెరీ సీరియ‌స్ ఇది
Advertisement
  • జూలై 30 లోపు జ‌గ్గారెడ్డి ఏదో చెప్తా అన్న‌డు అని మీరే గుర్తు చేసిర్రు.. ఓకే గుడ్.. మీడియా యాక్టివ్ ఉంది
  • కానీ నేన్ ఏం మాట్లాడాల‌న్నా ఫ‌స్ట్ రాహుల్‌కు చెప్పాలే
  • అప్ప‌డిదాకా ఏం మాట్లాడా.. ఎందుకంటే ఆయ‌న‌కు మాటిచ్చిన‌
  • పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ‌కీయంగా నాకొక ఖ‌త‌ర్నాక్ కోరిక ఉంద‌ని.. అదేందో న‌వంబ‌ర్‌లో చెప్తాన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, పీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాకు సీఎం కావాల‌ని లేద‌ని.. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి దానికి ఎప్ప‌టికీ ట్రై చేస్తూనే ఉంట‌డ‌న్నారు. వ‌చ్చే నాలుగు నెల‌ల్లో నాకు కొంత‌ క్లారిటీ వ‌స్తుంద‌ని.. అప్పుడు మ‌న‌సులో ఉన్న విష‌యాల‌న్నీ బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. పార్టీలో ఎన్ని లొసుగులు ఉన్నా రాహుల్‌కు చెప్పినంక‌నే మాట్లాడ‌తాన‌న్నారు. ఎందుకంటే ఆయ‌నకు తాను మాటిచ్చాన‌ని పేర్కొన్నారు. తాజాగా ఆయ‌న సంగారెడ్డి జిల్లాలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

దానికి ఉత్త‌మ్ ట్రై చేస్త‌నే ఉంట‌డు..

నా కోరికేంటో న‌వంబ‌ర్‌లో చెప్తా. వెరీ సీరియ‌స్ ఇది. మీరేదో అనుకుంటున్న‌ట్టున్న‌రు అది కాదు.. అదే సీఎం స‌బ్జెక్టు అయితే కాదు. ఇప్పుడ సీఎంగా రేవంత్‌రెడ్డి ఉన్న‌డు. ఆయ‌న ఇంకేదో ఐదేళ్లు అంటున్న‌డు. మ‌ళ్లా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎప్ప‌టికీ ట్రై చేస్త‌నే ఉంట‌డు. అది వాళ్ల పంచాది. వాళ్ల‌కు సంబంధించింది. మ‌నం దాంట్ల‌కు పోం. నాకు పొలిటిక‌ల్‌గా ఇంకో కోరిక ఖ‌త‌ర్నాక్ ఉంది. వ‌చ్చే నాలుగు నెల‌ల్లో రాజ‌కీయ‌ప‌రంగా నాకు కొంత క్లారిటీ వ‌స్త‌ది. ఆ క్లారిటీలో క్లారిటీ ఉండాలి. న‌వంబ‌ర్‌లో చెప్తా అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.

24 X 24 పొలిటిక‌ల్ నేన్‌..

న‌వంబ‌ర్‌ల రెండు ర‌కాలు ఉండొచ్చు. ఒక‌టేమో మ‌న‌సులో ఏముందో చెప్పే ప‌రిస్థితి వ‌స్త‌దా.. అప్పుడు ఇట్ల చెప్పినా అని మార్చి చెప్పే ప‌రిస్థితి వ‌స్తదా? తెల్వ‌దు. ఎందుకంటే 24 X 24 పొలిటిక‌ల్ నేన్‌. ప‌బ్లిక్, పాలిటిక్స్‌. నో ఫ్యామిలీ.. భార్య, పిల్ల‌లు ఉండ‌రు నాకు. ఓన్లీ ప‌బ్లిక్, పాలిటిక్సే. ఇది నా లైన్ ఉంట‌ది ఎప్పుడు. కాబ‌ట్టి మ‌ళ్లా మీతోటి న‌వంబ‌ల షేర్ చేస్తా అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

నాకు కోప‌మొస్తే రాహుల్‌కే చెప్తా..

రాహుల్ గాంధీని క‌లిసిన‌ప్పుడు కొన్ని విష‌యాలు చెప్పిండు నాకు. నీకు కాంగ్రెస్ మీద కోపం వ‌స్తే నువ్ బ‌య‌ట తిట్ట‌కు అని చెప్పిండు. నువ్ ఢిల్లీకి రా.. నా ముందు తిట్టు అని అన్న‌డు. కానీ మీడియా ముందు మాత్రం ఏం అన‌కు అని చెప్పిండు. నిజంగా చెప్తున్నా.. నా ప‌క్క‌న‌ మాణిక్ ఠాకూర్ ఉన్న‌డు అప్పుడు. అందుకే అంత‌ర్గత విష‌యాలు ఎన్ని ఉన్నా మూడున్న‌రేండ్ల నుంచి ఏం మాట్లాడుత‌లే. రాహుల్‌కు ఇచ్చిన మాట మీద ఉన్నా.

ఏం మాట్లాడాల‌న్నా ఫ‌స్ట్ ట్రైన్ ఎక్కాలే...

మీరేమో జ‌గ్గారెడ్డి జూలై 30 లోప‌ల ఏదో చెప్తా.. ఏదో మాట్లాడుతా అన్న మాట ఏమైంద‌ని మీరే యాజ్జేసిర్రు. నేన్ మ‌ర్సిపోయిన. ఒకే గుడ్ మీడియా యాక్టివ్ ఉన్న‌ది. నా మాట మీద నేను ఉన్నా. కానీ ఇక్క‌డ ఏమైందంటే నేన్ ఏం మాట్లాడాల‌న్నా ఫ‌స్ట్ ట్రైన్ ఎక్కి ఢిల్లీ పోయి రాహుల్‌కు చెప్పినంక‌నే మీడియా ముందు మాట్లాడ‌తా అని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement